Begin typing your search above and press return to search.

గ్యాస్ కొరత...కూటమి సర్కార్ క్లారిటీ

ఇదిలా ఉంటే ఏపీలో మొత్తం ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 161.19 లక్షలుగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఐవోసీఎల్ 56.86 లక్షలుగా ఉన్నాయి. హెచ్ పీసీఎల్ కనెక్షన్లు 74.11 లక్షలు, బీపీసీఎల్ 30.22 లక్షలు ఉన్నాయి.

By:  Satya P   |   14 March 2026 11:39 PM IST
గ్యాస్ కొరత...కూటమి సర్కార్ క్లారిటీ
X

ఏపీలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని సరఫరాలోనూ ఏ విధమైన ఇబ్బంది లేదని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఏపీలో అందరికీ సకాలంలో గ్యాస్ సరఫరా జరుగుతుందని చెబుతోంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎప్పటికప్పుడు పరిస్థితిని పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నామని చెబుతోంది.

ఎల్పీజీ కనెక్షన్ల తాజా పరిస్థితి :

ఇదిలా ఉంటే ఏపీలో మొత్తం ఎల్పీజీ కనెక్షన్ల సంఖ్య 161.19 లక్షలుగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఐవోసీఎల్ 56.86 లక్షలుగా ఉన్నాయి. హెచ్ పీసీఎల్ కనెక్షన్లు 74.11 లక్షలు, బీపీసీఎల్ 30.22 లక్షలు ఉన్నాయి. అలాగే రోజువారీ ఎల్పీజీ అవసరం కోసం 4 వేల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉందని పేర్కొంది. ఇక ఈ నెల 12 నాటికి మొత్తం ఎల్పీజీ స్టాక్ లభ్యత 15,880 మెట్రిక్ టన్నులుగా ఉందని పేర్కొంది. ఇది 3.92 రోజులకు సరిపోతుందని పేర్కొంది.

పూర్తి నియంత్రణలో :

ఇక చూస్తే కనుక ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ అందుబాటు సరఫరా పరిస్థితి నియంత్రణలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే సోషల్ మీడియాల్లో వినియోగదారులను తప్పుదారి పట్టించేవారు అలాగే, నిరాధారమైన ప్రచారం చేస్తున్న వారు ఉన్నారని అధికారులు విమర్శిస్తున్నారు. తగినంత ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులో లేదన్న వదంతులు వాస్తవం కాదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా పుకార్లు కారణంగా దేశీయ రీఫిల్ బుకింగ్స్ ఒక్కసారిగా 15 శాతం మేర పెరిగిందని గుర్తు చేశారు. ఇక దుర్వినియోగం నిరోధించడానికి ఓటీపీ ఆధారిత డెలివరీతో అందిస్తున్నామని చెప్పారు.

నిరంతర పర్యవేక్షణలో :

ఇక పెండింగ్ బుకింగుల పర్యవేక్షణ డిస్ట్రిబ్యూటర్ వారీగా, మార్కెట్ వారీగా జిల్లాల వారీగా సేల్స్ ఏరియా వారీగా ప్రాంతం వారీగా ఉందని అధికారులు చెబుతున్నారు. గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి పరిశ్రమలకు బల్క్ ఎల్పీజీ సరఫరా నిలిచిందని చెప్పారు అదే విధంగా ముఖ్యమైన విభాగాలుగా తీసుకుని ఆసుపత్రులు, హాస్టల్స్, ప్రభుత్వ సేవలఅకు వాణిజ్య సరఫరా కోసం ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పారు.

ఆర్టీజిఎస్ లో కంట్రోల్ రూమ్ :

ఇక ఏపీ సచివాలయంలోని ఆర్టీజిఎస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రెవెన్యూ,పౌర సరఫరాలు,పోలీసు, ఓఎంసీ ప్రతినిధుల సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా పర్యవేక్షణ సెల్ ని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వాస్తవాన్ని తెలియజేయడానికి ఎప్పటి కప్పుడు పత్రికా ప్రకటనలు జారీ జరుగుతోందని అధికారులు వివరించారు.