Begin typing your search above and press return to search.

సన్ రైజర్స్ నితీష్ రెడ్డి... ఈ పవన్ పాటకు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే...?

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ "జానీ" సినిమాలోని "నారాజు గాకుర అన్నయ్య.." పాటను నితీష్ తరచూ వింటున్నట్లు తెలిపాడు!

By:  Tupaki Desk   |   10 April 2024 12:39 PM GMT
సన్  రైజర్స్  నితీష్  రెడ్డి...  ఈ పవన్  పాటకు ఎంత పెద్ద ఫ్యాన్  అంటే...?
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ సాగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్ ను క్రీడగా కంటే ఎక్కువగా చూసే దేశంలో ఐపీఎల్ కి ఉన్న స్థానం ప్రత్యేకం అనే చెప్పాలి. దీంతో... ప్రతీ రోజూ సాయంత్రం 7 గంటలు దాటితే టీవీలకు అతుక్కుపోతున్నారంట క్రికెట్ అభిమానులు! ఈ సమయంలో తాజాగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టులోని తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి!

అవును... జెర్సీ మారింది.. కెప్టెన్ మారాడు.. టీం కూడా మారింది, మరి పెర్ఫార్మెన్స్ కూడా మారుతుందా అనే చర్చ ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన మొదట్లో బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే కమీన్స్ నేతృత్వంలో నిజంగానే సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ మారింది.. తదనుగుణంగా ఫలితాలూ మారాయి! ఈ సమయంలో తాజాగా పంజాబ్ కింగ్స్ పై గెలిచింది. దీంతో.. పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్ కి చేరింది.

ఈ మ్యాచ్ లో అటు బ్యాటింగ్ (64: 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్ లు), ఇటు బౌలింగ్ (3 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఒక వికెట్), అటు ఫీల్డింగ్ (ఒక క్యాచ్) లోనూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి ఆల్ రౌండర్ ప్రతిభ కనబరిచాడు. దీంతో... పంజాబ్ తో జరిగిన మ్యాచ్ అనంతరం నితీష్ రెడ్డి కి సంబంధించిన చర్చ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సమయంలో తాజాగా తెలుగు సినిమాల్లో పవన్ కల్యాణ్ సాంగ్ ఒకటి పాడి వినిపించిన నితీష్.. ఆ పాట అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు.

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ "జానీ" సినిమాలోని "నారాజు గాకుర అన్నయ్య.." పాటను నితీష్ తరచూ వింటున్నట్లు తెలిపాడు! ఇదే క్రమంలో... మ్యాచ్‌ కు ముందు ప్రతిసారీ ప్రత్యేకమైన పాట తనను ప్రశాంత పరుస్తుందని నితీష్ వెల్లడించాడు! ఇదే సమయంలో ఆ పాటను రెండు లైన్లు పాడి కూడా వినిపించాడు నితీష్. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.