Begin typing your search above and press return to search.

బాబు బాటలో నితీష్... ఆ వర్గాన్ని గట్టిగా టార్గెట్ !

ఏపీలో 2024 ఎన్నికలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది.

By:  Tupaki Desk   |   8 Sept 2025 9:47 AM IST
బాబు బాటలో నితీష్... ఆ వర్గాన్ని  గట్టిగా టార్గెట్ !
X

ఏపీలో 2024 ఎన్నికలు అందరికీ గుర్తు ఉండే ఉంటాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఎన్నికలలో కూటమి తమదైన శైలిలో ఒక ఆకర్షణీయమైన ఎన్నికల మేనిఫేస్టోని రిలీజ్ చేసింది. అందులో ఎక్కువగా మహిళలను ఉద్దేశించిన పధకాలే ఉన్నాయి. సూపర్ సిక్స్ పధకాలను కనుక ఒక్కసారి చూస్తే కనుక మహిళల కోసమే ఎక్కువగా కనిపిస్తాయి. చంద్రబాబు పక్కా ప్లాన్ ప్రకారం ఆ వర్గాన్ని టార్గెట్ చేసి సూపర్ సక్సెస్ కొట్టారు. ఇపుడు ఇదే పంధాను బీహార్ సీఎం నితీష్ కుమార్ అనుసరించబోతున్నారు అన్న చర్చ సాగుతోంది.

మహిళా రోజ్ గార్ తో :

బీహార్ లో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా ఓట్లను గుత్తమొత్తంగా తమ ఖాతాలో వేసుకోవడానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొత్త వ్యూహాలకు తెర తీశారు. ఆయన సరి కొత్త పధకంగా ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన్ను ముందుకు తెచ్చారు. మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచే లక్ష్యంతో ఈ పధకాన్ని తెస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇక్కడ నితీష్ కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆయన అధికారంలో ఉన్నారు. దాంతో హామీగా కాకుండా ఏకంగా పధకాన్నే అందిస్తున్నారు. తాజాగా ఆయన మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో రూపొందించిన కొత్త పథకం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. ఈ పథకాన్ని జనంలోకి విస్తృతంగా ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి అనేక ప్రచార వాహనాలను కూడా నితీష్ కుమార్ ప్రారంభించారు. అంతే కాకుండా ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌ను సైతం ఆయన ప్రారంభించారు.

ఇదీ పధకం :

ఇక ఈ పథకం వివరాలలోకి వస్తే కనుక రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుండి ఒక మహిళకు తనకు నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది. అంతే కాకుండా ఆర్థిక సహాయం మొదటి విడతగా ఎంపిక చేయబడిన ప్రతి మహిళ తాను ఎంచుకున్న ఉపాధి కార్యకలాపాలను ప్రారంభించడానికి పది వేల రూపాయలను నేరుగా వారి ఖాతాలలో ప్రభుత్వం వేస్తుంది. ఈ పథకానికి గ్రామీణాభివృద్ధి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.

రెండు లక్షల దాకా లబ్ది :

ఈ పధకం కింద తరువాత దశలలో చూస్తే కనుక ఎంపిక అయిన ఆయా మహిళలు ప్రభుత్వం ఇచ్చిన పది వేల రూపాయలను అందుకుని తమకు నచ్చిన ఉపాధి ప్రారంభించిన ఆరు నెలల తర్వాత వారి ఉపాధి అవకాశాలు వారి వ్యాపారాభివృద్ధిని అంచనా వేస్తారు. ఆ మీదట వారి ఉపాధికి లేదా వ్యాపారానికి మరింతగా నగదు మొత్తాలు అవసరమైతే కనుక్ల అలా ఎంపిక చేయబడిన ప్రతీ మహిళా లబ్ధిదారునికి ఏకంగా రెండు లక్షల రూపాయల వరకు అదనపు మద్దతు అందించబడుతుంది. ఇక ఈ పథకంలో భాగంగా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకం కోసం గ్రామాలు పట్టణాలలో స్థానిక మార్కెట్లు హాత్ బజార్‌లను కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ పధకం కింద పెద్ద ఎత్తున మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు అవ్తయాని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా వారిలో ఉన్న టాలెంట్ సైతం బయటకు రావడం ద్వారా కొత్త ఉత్పత్తులు జనాలకు అంద్తాయని అలా స్థానిక మార్కెట్లు సైతం అభివృద్ధి చెందుతాయని ప్రజలకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటూ మార్కెట్ ఎకానమీ అభివృద్ధి చెందుతుదని భావిస్తున్నారు.

విజయ మంత్రమేనా :

రెండు నెలలలో ఎన్నికలు ఉన్నాయి అనగా నితీష్ కుమార్ ఈ పధకాన్ని ప్రారంభించారు. అంతే కాదు ఏకంగా ఎంపిక చేసిన వారికి పది వేల రూపాయలను వారి ఖాతాలో వేస్తున్నారు. అంటే ఈ పధకం హామీ కాదు, ఆచరణలోకి వచ్చేస్తోంది. అలా ఎంపికైన ప్రతీ కుటుంబంలోని ఒక మహిళకు పది వేల రూపాయలు దక్కుతాయి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల వారంతా సానుకూలంగా ఉండడానికి ఆస్కారం ఉంది అని అంటున్నారు. రేపటి రోజున తమ ఉపాధి అభివృద్ధికి అవసరమైన అదనపు మొత్తాలు అందుకోవాలంటే ఈ ప్రభుత్వమే ఉండాలని భావించే వారు హెచ్చు సంఖ్యలో ఉంటారు అని అంటున్నారు. అందువల్ల ఇది నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్ డీయే ప్రభుత్వం మరో సారి అధికారంలోకి రావడానికి తారక మంత్రంగా ఉపయోగపడుతుందాని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి బీహార్ మహిళా లోకం ఏ విధంగా రియాక్ట్ అవుతారో.