బీహార్ చుట్టూ తిరుగుతున్న ఉప రాష్ట్రపతి పదవి!
బీహార్ లో ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి ఎన్డీయే సర్కార్ ని అక్కడ పున స్థాపితం చేయాలన్నది బీజేపీ ఆలోచన
By: Tupaki Desk | 24 July 2025 12:36 PM ISTబీహార్ లో ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి ఎన్డీయే సర్కార్ ని అక్కడ పున స్థాపితం చేయాలన్నది బీజేపీ ఆలోచన. అంతే కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బీహార్ సీఎం పదవిని చేపట్టాలన్నది గట్టి సంకల్పం. దానితోనే ఆనేక రకాలుగా ఆలోచనలు బీజేపీ నాయకత్వం చేస్తోంది అని అంటున్నారు.
ఎందరో పేర్లు ఎవరెవరో రేసులోకి వస్తున్నారు అని వార్తా కధనాలు. కానీ ఒక్కటి మాత్రం సుస్పష్టం అని అంటున్నారు. అదే బీహార్ నుంచే కొత్త ఉప రాష్ట్రపతి వస్తారన్నది. బీహార్ లో ఎన్నికలు ఉన్నాయి. అందుకే రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి ఎంపిక ఉంటుందని అంటున్నారు. అలా ఆలోచిస్తే కొత్త వైస్ ప్రెసిడెంట్ కేరాఫ్ బీహార్ అని అంటున్నారు.
ఇక్కడ బీజేపీ భారీ స్కెచ్ వేస్తోంది. ఏకంగా బీహార్ సీఎం పీఠం మీద నుంచే నితీష్ కుమార్ ని పక్కన పెట్టి ఆయనకు ఈ పదవి ఇవ్వాలని చూస్తోంది. అలా ఆయన ప్లేస్ లో బీజేపీకి చెందిన తమ నాయకుడిని కొత్త సీఎం గా కూర్చోబెట్టాలని ఎన్నికల తరువాత కూడా బీజేపీ నేత కొత్త సీఎం అయ్యేలా పావులు కదుపుతోంది. అయితే దీనిని నితీష్ కుమార్ ఎంతవరకూ అంగీకరిస్తారు అన్నదే చర్చట.
ఎందుకంటే ఆయనకు క్రియాశీలకంగా ఉండడమే ఇష్టం అంటున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగుతారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. తన కుమారుడికి కనుక సీఎం పదవి ఇస్తే తాను తప్పుకోవడానికి రెడీ అని అంటున్నారు అని చెబుతున్నారు. అది అసలు జరిగే పని కాదు. ఇక రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ అయిన హరి వంశ నారాయణ్ సింగ్ పేరు కూడా నలుగుతోంది.
తాజాగా ఆయన కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలసి వచ్చారు. దాంతో ఈ ప్రచారం మరింత ఊపు అందుకుంది. ఆయన బీహార్ కే చెందిన వారు, పైగా జేడీయూ కి చెందిన వారు. ఆయన కనుక కాకపోతే బీహార్ కి చెందిన కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూర్ కి ఈ పదవి ఇస్తారని అంటున్నారు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకోవడంతో ఈ ప్రచారం ఇంకా పెరిగింది.
ఇకా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఒక దశలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పేరు కూడా ముందుకు వచ్చింది. అయితే అవన్నీ పుకార్లుగానే ఉన్నాయి. మొదట జేడీయూకి ఇవ్వాలని అనుకున్నా బీహార్ రాజకీయాలలో తమకు అనుకూలంగా లేకపోతే మాత్రం బీజేపీకి చెందిన వారికే ఈ పదవి ఇవ్వాలని కాషాయం పెద్దలు భావిస్తున్నారుట. అందుకే కేంద్ర మంత్రి రాంనాథ్ ఠాకూరు పేరు బయటకు వచ్చింది. మొత్తం మీద చూస్తే ఈయనే ఖాయం అయ్యేట్లుగా ఉన్నారని చెబుతున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మోడీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత అమిత్ షాతో కలసి చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.
