Begin typing your search above and press return to search.

నీతా అంబానీ పింక్ కార్ షాకిచ్చే ధ‌ర‌

ముఖేష్ అంబానీ 2024లో భారతదేశంలో అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు.. బిలియనీర్ వ్యాపారవేత్త ప్రపంచంలోని 9వ గొప్ప‌ ధనవంతుడు

By:  Tupaki Desk   |   10 April 2024 1:30 PM GMT
నీతా అంబానీ పింక్ కార్ షాకిచ్చే ధ‌ర‌
X

ముఖేష్ అంబానీ 2024లో భారతదేశంలో అత్యంత ధనవంతుడు మాత్రమే కాదు.. బిలియనీర్ వ్యాపారవేత్త ప్రపంచంలోని 9వ గొప్ప‌ ధనవంతుడు. ఫోర్బ్స్ ప్రకారం... రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ 116 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9.6 లక్షల కోట్లు) సంపదను కలిగి ఉన్నారు. ముఖ్యంగా అంబానీ కొడుకు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ కోసం ఏకంగా 1000 కోట్లు ఖ‌ర్చు చేయ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అందువల్ల అంబానీలు దుబారాపై మక్కువ కలిగి ఉండటంలో ఆశ్చర్యం క‌లిగించ‌దు. ఇందులో అసూయ కలిగించే అల్ట్రా ల‌గ్జ‌రీ కార్ల సేకరణ కూడా ఒక భాగం.

ముఖేష్ అంబానీ కార్ గ్యారేజ్‌లో 168 ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. మేబ్యాక్, ఫెరారీ, బెంట్లీ, మెర్సిడెస్-బెంజ్ , BMW వంటి ప్రపంచవ్యాప్తంగా త‌యారైన‌ లగ్జరీ కార్లు ఉన్నాయి. అయితే అంబానీ కుటుంబానికి వ్యక్తిగతంగా ఇష్టమైనది ప్రతిష్టాత్మక రోల్స్ రాయిస్. నీతా అంబానీ ఇటీవల ఒక సరికొత్త మోడల్‌ను కొనుగోలు చేసింది. ఇది పింక్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII.

హిందూస్థాన్ టైమ్స్ ప్రకారం.. నీతా అంబానీ కొత్త కార్ ఖ‌రీదు రూ. 12 కోట్లకు పైగానే ఉంటుంది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ని నీతాజీ అవ‌స‌రాల మేర‌కు స్పెసిఫికేషన్‌ల ప్రకారం అద్భుతంగా కస్టమైజ్ చేసారు. ఇందులో రోజ్ క్వార్ట్జ్ దిగువ బాడీ.. వెల్వెట్ ఆర్చిడ్ పై భాగం ఆక‌ర్ష‌ణీయంగా ఉన్నాయి. భారతదేశంలో రోల్స్ రాయిస్ విషయానికి వస్తే.. ఎక్కువగా నలుపు -తెలుపు షేడ్స్‌లో చూస్తాం. అందువల్ల, నీతా అంబానీ కారు విచిత్రమైన రంగుతో ఎంత సొగసైనదిగా ఉందో హెడ్‌లైన్స్ లో కొస్తోంది.

ఈ ల‌గ్జ‌రీ కారులో గోల్డ్ SoE (స్పిరిట్ ఆఫ్ ఎక్స్‌టసీ), డిన్నర్ వీల్స్, దాని హెడ్‌రెస్ట్‌లపై ఎంబ్రాయిడరీ చేసిన NMA ఉన్నాయి. రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWB (ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్) 6.75-లీటర్ V12 ట్విన్-టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో గరిష్టంగా 571 బిహెచ్‌ఫి .. 900 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

గత సంవత్సరం దీపావళి కానుకగా ముఖేష్ అంబానీ నీతా అంబానీకి రూ. 10 కోట్ల విలువైన టస్కాన్ సన్‌షేడ్ ఆరెంజ్ క‌ల‌ర్ కస్టమైజ్ చేసిన రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌ని బహుమతిగా ఇచ్చారు. ఒక మీడియా క‌థ‌నం ప్ర‌కారం... ఇది భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ గిఫ్ట్. ఇదిలా ఉండగా ఏప్రిల్ 10న ముకేశ్ అంబానీ - నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకల సంద‌ర్భంగా ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీలు సంబరాలు చేసుకుంటున్నారు.