అంబానీ భార్య నీతా అంబానీ నికర ఆస్తి- విద్యార్హతలు?
1 నవంబర్ 1964న జన్మించిన నీతా అంబానీ మధ్యతరగతి వాతావరణంలో పెరిగారు. ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు.
By: Tupaki Desk | 9 Jun 2025 8:59 AM ISTనీతా అంబానీ బిలియనీర్ ముఖేష్ అంబానీ భార్య మాత్రమే కాదు. నీతాజీ స్వతహాగా ఒక వ్యాపారవేత్త. దాత- సేవికురాలు. రిలయన్స్ ఫౌండేషన్ కి కర్త కర్మ క్రియ. నీతాజీ ఐపీఎల్ జట్టు - ముంబై ఇండియన్స్ యజమాని కూడా. నీతా అంబానీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 2,500 కోట్లు. అంబానీ కుటుంబం నిర్వహించిన అనేక కార్యక్రమాల కారణంగా నీతా అంబానీ హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. నీతా అంబానీ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు కూడా. అయితే ఇంత పెద్ద వ్యవస్థల్ని విజయవంతంగా నడిపిస్తున్న నీతా అంబానీ విద్యార్హతలు ఏమిటి? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
1 నవంబర్ 1964న జన్మించిన నీతా అంబానీ మధ్యతరగతి వాతావరణంలో పెరిగారు. ముంబైలోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. ఆ తర్వాత ఆమె ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరి నెలకు రూ. 800 సంపాదించారు. ఇటీవల నీతా అంబానీని హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన తల్లిదండ్రుల వద్ద తనను హార్వర్డ్‌కు పంపడానికి తగినంత డబ్బు లేదని గుర్తు చేసుకున్నారు. వెళ్లడానికే యోగ్యత లేని నన్ను హార్వార్డ్ లో ప్రసంగం కోసం పిలిచారు`` అని నీతాజీ వ్యాఖ్యానించారు.
నీతా అంబానీ శిక్షణ పొందిన భరతనాట్య నృత్యకారిణి కూడా. తనకు నృత్యం అంటే చాలా ఇష్టం. ప్రతి భారీ అంబానీ ఈవెంట్ తర్వాత ఇంటర్నెట్ లో నీతాజీ డ్యాన్సుల వీడియోలు దర్శనమిస్తుంటాయి. తన పిల్లల పెళ్లిళ్లు, ఫంక్షన్లలో నృత్యం చేయడం కనిపించింది. నీతాజీకి కళలు, కళాపోషణ అంటే చాలా మక్కువ. ఆమె కళల్ని పెంచి పోషిస్తున్నారు. అభిరుచిని కొనసాగిస్తున్నారు.
