నిర్మలమ్మే బీజేపీ అధ్యక్షురాలంట !
కేంద్ర ఆర్ధిక మంత్రిగా రక్షణ మంత్రిగా కీలక శాఖలను చూశారు నిర్మలా సీతారామన్. ఆమెకు ఎందుకు బీజేపీలో అంతటి ప్రాధాన్యత కలిగిన శాఖలు దక్కాయి అంటే ఆమె మోడీ అమిత్ షాల నమ్మకస్తురాలిగా గుర్తింపు పొందారు అని చెబుతారు.
By: Tupaki Desk | 7 July 2025 11:30 AM ISTకేంద్ర ఆర్ధిక మంత్రిగా రక్షణ మంత్రిగా కీలక శాఖలను చూశారు నిర్మలా సీతారామన్. ఆమెకు ఎందుకు బీజేపీలో అంతటి ప్రాధాన్యత కలిగిన శాఖలు దక్కాయి అంటే ఆమె మోడీ అమిత్ షాల నమ్మకస్తురాలిగా గుర్తింపు పొందారు అని చెబుతారు. ఆమెకు ఆంగ్లం హిందీతో పాటు ఇతర భాషాల మీద కూడా పట్టు ఉంది. అంతే కాదు డైనమిక్ లేడీగా గుర్తింపు ఉంది.
ఇక ఆమె తమిళనాడుకు ఆడపడుచు. అలాగే తెలుగింటి కోడలు. ఇలా ఆమెకు ప్రాంతీయంగా కలసి వచ్చిన అంశాలు ఉన్నాయి. ఆమె ఒక మహిళగా ఏకంగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టి రికార్డుని సాధించారు. ఇందిరాగాంధీ తరువాత కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన రెండవ మహిళగా ఉన్నారు. డేరింగ్ గా ఆమె వ్యవహరిస్తారు. రక్షణ మంత్రిగా ఆమె అది నిరూపించుకున్నారు.
ఒక్క మాటలో చెప్పాలీ అంటే మోడీ అమిత్ షాల ఏలుబడిలో నిర్మలమ్మకు బాగా ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో జాతీయ బీజేపీ అధ్యక్ష పదవిని ఆమెకు ఇస్తారని ఢిల్లీ స్థాయిలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె వినయ విధేయ నిర్మలమ్మగా ఉన్నారని, పైగా దక్షిణ భారతానికి చెందిన వారు రెండు ముఖ్యమైన రాష్ట్రాలతో అనుబంధం కలిగిన వారుగా ఉన్నారని అంటున్నారు.
బీజేపీ కూడా ఆమె సేవలను ఈసారి పార్టీ కోసం ఉపయోగించుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. పైగా మహిళా కోటా పేరుతో రిజర్వేషన్లు ఆమోదించిన ఘనతను ఇప్పటికే సొంతం చేసుకున్న బీజేపీలో పురుషాధిపత్యం ఎక్కువగా ఉందని విమర్శలు ప్రత్యర్థుల నుంచి వస్తున్న వేళ ఈసారి లేడీస్ కి చాన్స్ అన్నది గట్టిగా వినిపిస్తోంది. అంతే కాదు 2029 ఎన్నికలు చాలా డిఫరెంట్ గా సాగుతాయని అంటున్నారు.
దేశంలో మూడవ వంతు ఎంపీ సీట్లలో మహిళలే పోటీ చేస్తారు. 33 శాతం రిజర్వేషన్లు ఆ ఎన్నికల్లో అమలు చేస్తారు అని అంటున్నారు. ఇక జనాభా గణన తరువాత దేశంలో మరో రెండు వందల సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అలా ఈ రెండు అంశాలను ఆసరాగా చేసుకుని మరోసారి గెలవాలని బీజేపీ చూస్తోంది. దాంతో సమర్ధురాలు అయిన మహిళా అధ్యక్షురాలు ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే గత పదకొండేళ్ళుగా దేశంలో కీలక మంత్రిత్వ శాఖలను చూసిన వారుగా దేశంలో ఎంతో కొంత పరిచయం ఉన్న నిర్మలమ్మ అయితే జాతీయ అధ్యక్ష స్థానానికి జనానికీ మధ్య కనెక్షన్ బాగా ఉంటుందని భావిస్తున్నారు.
పైగా ఆమె నిరాడంబరత. ఒక సాధారణ గృహిణి మాదిరిగా ఆమె వ్యవహరించే తీరు మహిళా ఓట్లను బీజేపీకి మరింతగా తెచ్చి పోస్తుందని కూడా బీజేపీ పెద్దలు విశ్వసిస్తున్నారుట. దాంతో బీజేపీ కొత్త అధ్యక్ష రేసులో ఎంతో మంది మహిళల పేర్లు వినిపించినా చివరికి నిర్మలమ్మకే ఆ పదవిని ఖరారు చేస్తారు అని అంటున్నారు.
ఆమెను ఆ పదవిలోకి తెచ్చాక కేంద్ర మంత్రి వర్గ విస్తరణను చేపడతారు అని కీకలమైన ఆర్ధిక శాఖను తమ మనసులో ఉన్న ఒక నాయకుడికి అప్పచెబుతారని అంతే కాకుండా మంత్రివర్గంలో మార్పులు చేర్పులూ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి కాబోయే బీజేపీ ప్రెసిడెంట్ నిర్మలమ్మ అన్నది హస్తిన వర్గాల భోగట్టా. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ఒక మహిళ ఈసారి స్వాతంత్ర దినోత్సవం నాటికి జెండా ఎగరేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
