Begin typing your search above and press return to search.

మరింత టఫ్ గా న్యూజిలాండ్ వీసా.. మార్పులు ఇవే

ప్రస్తుతం న్యూజిలాండ్ దేశ జనాభా 51 లక్షలకు పైనే ఉంది. కొవిడ్ తర్వాత ఈ దేశానికి వలసలు విపరీతంగా పెరిగాయి

By:  Tupaki Desk   |   9 April 2024 7:21 AM GMT
మరింత టఫ్ గా న్యూజిలాండ్ వీసా.. మార్పులు ఇవే
X

తమ దేశాలకు వచ్చే వలసజీవులకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే అగ్ర రాజ్యం.. ఆర్థికంగా ఉన్నతిలో ఉండే దేశాల్లో వలస ప్రజలను అనుమతించే విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆ జాబితాలో చేరింది న్యూజిలాండ్. ఈ దేశానికి గత ఏడాది ఏకంగా రూ.1.73 లక్షల మంది పోటెత్తటం తెలిసిందే. దీంతో చోటు చేసుకుంటున్న పరిణామాలతో అక్కడి ప్రభుత్వం వలసల్ని నియంత్రించే అంశంపై ఫోకస్ పెట్టింది. ఉపాధి వీసా నిబంధనల్లో తక్షణమే మార్పులు చేస్తున్నట్లుగా వెల్లడించింది.

దీనికి సంబంధించి కీలక నిర్ణయాల్ని పేర్కొంటూ.. పెద్దగా నైపుణ్యం అవసరం లేని పనుల్ని వెతుక్కుంటూ వచ్చే వారికి ఇంగ్లిషు మీద పట్టు ఉండటం.. ఉద్యోగవీసాల విషయంలో కనీస నైపుణ్యాలు.. పని అనుభవాల్ని పరిగణలోకి తీసుకోవాలన్న కొత్త నిబంధనల్ని చేరుస్తున్నారు. తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్ని చేసే వారికి స్థానికంగా ఉండే నివాస గడువును ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించటం కొత్త పరిణామంగా చెబుతున్నారు.

సెకండరీ టీచర్లు లాంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించటం.. అలాంటి వారిని తమ దేశంలోనే కొనసాగేలా చూడటంపై ఫోకస్ పెట్టినట్లుగా న్యూజిలాండ్ మంత్రి చెబుతున్నారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల విషయంలో తమ దేశ వాసులకు అవకాశాల్లో ముందు వరుసలో ఉండేలా తమ నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు.

ప్రస్తుతం న్యూజిలాండ్ దేశ జనాభా 51 లక్షలకు పైనే ఉంది. కొవిడ్ తర్వాత ఈ దేశానికి వలసలు విపరీతంగా పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశంలోనూ వలసల సంఖ్యను రానున్న రెండేళ్లలో సగానికి పైగా తగ్గించాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి వలసలకు పెద్దగా ఇబ్బందులు లేని దేశంగా ఉన్న న్యూజిలాండ్ ఇకపై అలాంటి పరిస్థితులు లేవని చెప్పక తప్పదు.