Begin typing your search above and press return to search.

పైలట్లు పెర్‌ ఫ్యూంలు వాడొద్దు.. డీజీసీఏ కొత్త రూల్!

ఈ విషయాలపై భార‌త పౌర విమాన‌యాన డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ చీఫ్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... విమానయాన సిబ్బంది ఎవరూ ఏ ఔషధాన్ని తీసుకోకూడదని.

By:  Tupaki Desk   |   3 Oct 2023 5:11 AM GMT
పైలట్లు పెర్‌  ఫ్యూంలు వాడొద్దు.. డీజీసీఏ కొత్త రూల్!
X

ఇంట్లోనుంచి బయటకు వస్తుంటే సెంటు కొట్టడం చాలామందికి అలవాటు. పని ఏదైనా పెర్‌ ఫ్యూం కొట్టుకోనిదే బయట అడుగుపెట్టని అలవాటు ఇంకొంతమందికి ఉంటుంది. ఇదే క్రమంలో... విమానాల్లో పనిచేసే సిబ్బంది కూడా సెంటు కొట్టుకుని డ్యూటీకి రావడం సహజమే! ఇందులో భాగంగా... విమాన సంస్థల సిబ్బంది కూడా దేశవిదేశాల్లో దొరికే రకరకాల ఫెర్ ఫ్యూం లు వాడుతుంటారు. కానీ... ఇకపై వారికి నో ఛాన్స్!

అవును... ఇకపై విమానాల్లో పనిచేసే సిబ్బంది సెంటు కొట్టుకోకూడదు. సపోజ్, ఫర్ సపోజ్ అలాంటి అలవాటు మానుకోలేము అనుకుంటే... కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది భార‌త పౌర విమాన‌యాన డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ (డీజీసీఏ). దీనికి వారివైపు నుంచి బలమైన కారణం కూడా ఉంది.

విమాన సర్వీసుల్లో పాల్గొనే సిబ్బందికి తరచూ బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహిస్తుంటారు. కొన్ని రకాల ఫెర్ ఫ్యూం లు, మౌత్‌ వాష్‌ లలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉంటుంది. దీంతో... బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని డీసీజీఏ భావిస్తోంది. అందువల్లే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాలపై భార‌త పౌర విమాన‌యాన డైరెక్టరేట్ జ‌న‌ర‌ల్ చీఫ్ మరిన్ని వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... విమానయాన సిబ్బంది ఎవరూ ఏ ఔషధాన్ని తీసుకోకూడదని.. మౌత్‌ వాష్‌, టూత్‌ జెల్‌, ఫెర్ ఫ్యూం లను వినియోగించొద్దని తెలిపారు. అయితే... ఆల్కహాల్‌ తో తయారైన ఇలాంటి ప్రోడక్ట్‌ ల కారణంగా బ్రీత్ ఎనలైజర్లలో పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఫ్లయింగ్ కార్యకలాపాల్లో పాల్గొనే వ్యక్తులెవరైనా ఔషధాలు తీసుకునే ముందు కంపెనీ వైద్యుడిని సంప్రదించాలి.. ఈ సమయంలో ఆ వ్యక్తి ఆల్కహాల్ సేవించకపోయినా... ఈ ఫెర్ ఫ్యూం, మౌత్ వాష్ ల వల్ల బ్రీత్ ఎనలైజర్ లో పాజిటివ్ గా చూపిస్తుందని అంటున్నారు. ఈ విషయాలను తాజాగా రూపొందించిన ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ రంగంలోని వారంద‌రి అభిప్రాయాల కోసం ఈ ముసాయిదాను ప‌బ్లిక్ డొమైన్‌ లో ఉంచుతున్నామ‌ని డీజీసీఏ ప్రకటించింది.