Begin typing your search above and press return to search.

కేంద్రం క్లారిటీ... కొత్త, పాత పన్ను విధానంలో తేడాలివే..!

మార్చి 31తో 2023 - 24 ఆర్థిక సంవత్సరం కాల పరిమితి ముగుసింది. నేటి నుంచి 2024 - 25 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యింది.

By:  Tupaki Desk   |   1 April 2024 10:02 AM GMT
కేంద్రం క్లారిటీ... కొత్త, పాత పన్ను విధానంలో తేడాలివే..!
X

మార్చి 31తో 2023 - 24 ఆర్థిక సంవత్సరం కాల పరిమితి ముగుసింది. నేటి నుంచి 2024 - 25 ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో... ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి! అయితే... ఈ కొత్త నిబంధనలపై పలు గాసిప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో... ఈ విషయాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది! ఇందులో భాగంగా కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ పలు కీలక విషయాలను ఆన్ లైన్ వేదికగా వెల్లడించింది.

అవును... సోమవారం నుంచి కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చిన నేపథ్యమంలో... ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు చెబుతున్న పలు సందేహాలను, అనుమానాలను నివృత్తి చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇందులో భాగంగా ప్రస్తుత పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115బీఏసి(1ఏ) కింద కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టిన విషయాన్ని.. ఫలితంగా మారిన పన్ను శాతాలను వెల్లడించింది.

ఇందులో భాగంగా... 01-04-2024 నుంచి పన్ను విధానంలో కొత్తగా మారేది ఏదీ లేదంటూ మొదలుపెట్టిన ఆర్థిక మంత్రిత్వ శాఖ... కొత్తపన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయని.. అయితే పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్ లు కొత్త విధానంలో లేవని వెల్లడించింది. ఇదే సమయంలో... ఇక నుంచి కొత్త పన్ను విధానం డీఫాల్ట్ గా వర్తించనుందని.. అయితే పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతది.. ఏది కావాలంటే ఆ విధానాన్ని ఎంచుకోవచ్చని తెలిపింది!

కొత్త పన్ను విధానం 115బీఏసీ(1ఏ) ప్రకారం...

రూ.3 లక్షల వరకు 0% పన్ను

రూ.3-6 లక్షల వరకు 5% పన్ను

రూ.6-9 లక్షల వరకు 10% పన్ను

రూ.9-12 లక్షల వరకు 15% పన్ను

రూ.12-15 లక్షల వరకు 20% పన్ను

రూ.15 లక్షలకు పైన 30% పన్ను

పాత పన్ను విధానం ప్రకారం...

రూ.2.5 లక్షల వరకు 0% పన్ను

రూ.2.5 నుంచి 5 లక్షల వరకు 5% పన్ను

రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20% పన్ను

రూ.10 లక్షలకుపైన 30% పన్ను