Begin typing your search above and press return to search.

దేశంలో మరోసారి విజ్రంభిస్తున్న కోవిడ్ ... వాట్ నెక్స్ట్?

ఈ సమయంలో ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 10:16 AM GMT
దేశంలో  మరోసారి విజ్రంభిస్తున్న కోవిడ్ ... వాట్  నెక్స్ట్?
X

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక పెరుగుదలకు కరోనా జేఎన్.1 వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. దీంతో... అమెరికా, యూకే, చైనా తర్వాత ఇండియాలోని పలు నగరాల్లో జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది హెచ్చరిస్తున్నారు.

అవును... దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఇందులో భాగంగా సరికొత్త రూపం జేఎన్‌.1 సబ్‌ వేరియంట్‌ వేగంగా విస్తరిస్తుంది. దీంతో ఆదివారం కొత్తగా 841 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. గత ఏడు నెలల్లో ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,309కి చేరింది. అదేవిధంగా కొత్తగా మరో ముగ్గురు మరణించారు. దీంతో మరణాల సంఖ్య 7కి చేరింది.

జేఎన్.1 అనే కోవిడ్ వైరస్ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారడం వంటి లక్షణాలతో సహా ఫ్లూ లాంటి సిండ్రోంకు కారణమవుతుంది. ఇదే సమయంలో ఈ లక్షణాలు శ్వాసకోశ వైరల్ ఇన్‌ఫెక్షన్‌ ను సూచిస్తాయి. అవి రెండు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లేదా జ్వరం అధిక స్థాయిలో ఉంటే లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటుంటే తప్పనిసరిగా మీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని అంటున్నారు.

ఒకపక్క కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న వేళ... నూతన సంవత్సర వేడుకలు కూడా ఎంటరయ్యాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా.. వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సమయంలో... వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కోవిడ్ -19 నిబంధనలను పాటించాలని ప్రజలను కోరుతున్నారు.

ఇందులో భాగంగా... అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని.. ఫేస్ మాస్క్‌ లు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు దేశంలో సుమారు 178 జేఎన్‌.1 కేసులు నమోదయవ్వగా.. 47 మంది మరణించారని తెలుస్తుంది. ఈ కేసుల్లో అత్యధికంగా గోవా - 47, కేరళ - 41, గుజరాత్‌ - 36, కర్ణాటక - 34 చొప్పున ఉన్నాయి.

కాగా... 2020లో వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 4.50 కోట్లు దాటిన సంగతి తెలిసిందే. ఇందులో సుమారు 5,33,361 మంది మరణించగా.. 4,44,75,602 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.81%గా ఉంది.