Begin typing your search above and press return to search.

న్యూజెర్సీ జంటకు అదృష్టం తలుపుతట్టింది..

టికెట్ స్క్రాచ్ చేయగానే తాము గెలిచిన భారీ మొత్తం చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మొదట అది నిజమేనా అని నమ్మలేకపోయారు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 8:00 PM IST
న్యూజెర్సీ జంటకు అదృష్టం తలుపుతట్టింది..
X

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ సాధారణ దంపతుల జీవితంలో ఒక్కసారిగా భారీ మార్పు వచ్చింది. వారు ఊహించని విధంగా లాటరీ ద్వారా ఏకంగా రూ.12.86 కోట్ల (దాదాపు 1.5 మిలియన్ డాలర్లు) జాక్‌పాట్‌ను గెలుచుకున్నారు.

ఈ అద్భుత ఘటన నట్టీలోని “లక్కీ 7 డెలీ” అనే స్టోర్‌ వద్ద చోటు చేసుకుంది. భోజనానికి బయలుదేరిన ఈ జంట ప్రయాణమధ్యలో సరదాగా $3 విలువ చేసే “విన్ ఫర్ లైఫ్” స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. అలా కొనుగోలు చేసిన టికెట్‌ వారికీ జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని ఇచ్చింది.

టికెట్ స్క్రాచ్ చేయగానే తాము గెలిచిన భారీ మొత్తం చూసి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మొదట అది నిజమేనా అని నమ్మలేకపోయారు. అనంతరం, అధికారికంగా ధృవీకరణ తర్వాత తమ గెలుపు నిజమని నమ్మారు. "ఇది నిజంగా అద్భుతమైన అనుభూతి. మాకు కొత్త జీవితం మొదలైనట్లుంది. ఇకపై జీవితం మరింత సులభమవుతుంది," అని ఆనందంతో చెప్పారు.

లాటరీ టికెట్ ద్వారా గెలిచే “విన్ ఫర్ లైఫ్” అనే పథకం ద్వారా వారు జీవితాంతం నెలనెలా స్థిరమైన మొత్తం పొందనున్నారు లేదా ఒకేసారి భారీ మొత్తాన్ని తీసుకునే ఎంపిక కూడా వారికి లభిస్తుంది.

ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా వారు ఇప్పుడు భవిష్యత్తుపై నమ్మకంతో ఉన్నారు. ఈ గెలుపు వారి జీవితాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నారు.

ఈ ఘటన మరోసారి "అదృష్టం ఎప్పుడెప్పుడు తలుపు చూపుతుందో ఎవరికీ తెలియదు" అన్న నానుడిని నిజం చేసింది.