Begin typing your search above and press return to search.

యూఎస్ లో హెచ్1బీ వీసాదారులకు ఇదో కొత్త కష్టం!

అవును... అమెరికాలోని హెచ్1బీ వీసాదారులకు డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ పొందడం ఓ పీడకలలా మారిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Sept 2024 9:00 AM IST
యూఎస్  లో హెచ్1బీ వీసాదారులకు ఇదో కొత్త కష్టం!
X

యునైటెడ్ స్టేట్స్ లోని చాలా మంది హెచ్1బీ వీసా దారులకు.. వీసా పునరుద్ధరణ కోసం డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ పొందడంలో అనిశ్చితి అనేది సరికొత్త సమస్యలను తెరపైకి తెస్తోంది. ఈ క్రమంలో ఓ హెచ్1బీ వీసాదారుడు సోషల్ మీడియాలో తన పరిస్థితిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ తన బాధను ప్రపంచంతో పంచుకున్నాడు.

అవును... అమెరికాలోని హెచ్1బీ వీసాదారులకు డ్రాప్ బాక్స్ అపాయింట్మెంట్ పొందడం ఓ పీడకలలా మారిందని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఓ హెచ్1బీ వీసాదారుడు... తన పరిస్థితిని పంచుకున్నాడు. ఇందులో భాగంగా... తాను దరఖాస్తు కోసం ఫిబ్రవరిలోనే పేమెంట్ చేసినట్లు తెలిపాడు.

అయితే.. ఇప్పటివరకూ వీసా అపాయింట్మెంట్ లు పొందలేకపోయినట్లు తెలిపాడు. ఈ సమయంలో తాను కుటుంబాన్ని చూడటనికి భారత్ కు వెళ్తున్నట్లు చెప్పిన అతడు.. తాను తిరిగి వస్తానో లేదో ఖచ్చితంగా తెలియదని.. అయితే తనకు యూఎస్ లో ఇల్లు కూడా ఉందని చెప్పాడు. ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అలా అని ఇది ఏ ఒక్కరి కథో అనుకుంటే పొరపటే... ఇది ఎంతో మంది హెచ్1బీ వీసాదారులలో పెరుగుతున్న ఆందోళన అని అంటున్నారు. ప్రధానంగా... యూఎస్ లో పెట్టుబడులు పెట్టిన వారికి, ఉద్యోగాల నుంచి కుటుంబాల వరకూ సాధారణ వీసా అపాయింట్మెంట్ కోసం వారి నిరీక్షణ అనిశ్చితి ఇప్పుడు చాలా కష్టకాలంగా మారింది.