Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు పిల్ల‌కాకి స‌వాలా? : దానంపై నెటిజ‌న్ల కామెంట్స్‌

ఖైర‌తాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే జంప్ జిలానీగా పేరు తెచ్చుకున్న దానం నాగేంద‌ర్‌.. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై స‌వాల్ విసిరారు. ''ప్ర‌మాణం చేస్తారా? చేయాలి'' అంటూ వ్యాఖ్య‌లు చేశారు

By:  Tupaki Desk   |   28 March 2024 11:30 PM GMT
కేసీఆర్ కు పిల్ల‌కాకి స‌వాలా?  :  దానంపై నెటిజ‌న్ల కామెంట్స్‌
X

''ఏ పార్టీ టికెట్ ఇస్తే.. ఆపార్టీ పాట పాడే దానం నాగేంద‌ర్ కూడా.. కేసీఆర్‌కు స‌వాల్ విస‌ర‌డ‌మా? పిల్ల‌కా కులు కూడా పాఠాలు నేర్పుతాయా?'' - ఇదీ నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌. దీనికి కార‌ణం.. ఖైర‌తాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే జంప్ జిలానీగా పేరు తెచ్చుకున్న దానం నాగేంద‌ర్‌.. తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌పై స‌వాల్ విసిరారు. ''ప్ర‌మాణం చేస్తారా? చేయాలి'' అంటూ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో నెటిజ‌న్లు ఒక్క‌సారి గా ఫైర్ అయ్యారు. దానం.. నీ స్థాయిని మ‌రిచిపోయావా? ప్ర‌గ‌తి భ‌వ‌న్ గేట్లు ప‌ట్టుకుని అప్పాయింట్ మెంటు కోసం వేచి ఉన్న క్ష‌ణాలు మ‌రిచిపోయావా? అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఏం జ‌రిగిందంటే..

గ‌త ఏడాది తెలంగాణలో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖైర‌తాబాద్ టికెట్ ద‌క్కించుకున్న జంప్ జిలానీ దా నం నాగేంద‌ర్ కారు గుర్తుపై పోటీ చేశారు. పార్టీ త‌ర‌ఫున గెలిచిన ఆయ‌న మూడు మాసాలు కూడా కాకుం డానే.. కేసీఆర్‌కు గుడ్ బై చెప్పి.. త‌న పాత పార్టీ కాంగ్రెస్‌కు జై కొట్టారు. ఈ క్ర‌మంలోనే తాజా పార్లెమెంటు ఎన్ని క‌ల్లో ఆయ‌న సికింద్రాబాద్ ఎంపీ సీటును కూడా పొందారు. అయితే.. కొన్నాళ్లుగా బీఆర్ ఎస్ నేత లు.. దానంను విమ‌ర్శిస్తున్నారు. పార్టీకి కాదు.. ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేయాల‌ని మాజీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

దీనిపై తాజాగా స్పందించిన దానం.. ఏకంగా కేసీఆర్‌కు స‌వాల్ రువ్వారు. దీనిని రాజకీయాల‌కు అతీతం గా నెటిజ‌న్లు తీవ్రంగా ఖండించారు. దానం ఏమ‌న్నాడంటే.. '' బీజేపీతో బీఆర్ ఎస్‌ను క‌లుపుతున్నామ‌ని.. వ‌చ్చే ఎన్నికల్లో లోపాయికారీ ఒప్పందం పెట్టుకుని ముందుకు సాగాల‌ని అనుకుంటున్నామ‌ని కేసీఆర్ నాకు చెప్పారు. మ‌త‌తత్వ పార్టీ అయిన .. బీజేపీతో బీఆర్ ఎస్ చేతులు క‌ల‌ప‌డాన్ని నేను జీర్ణించుకోలేక పోయాను. అందుకే.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాను. బీజేపీతో క‌లుస్తున్నామ‌ని కేసీఆర్ అన్నారు. ఆయ‌న అన‌లేద‌ని ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా? చేయాలి'' అని దానం స‌వాల్ రువ్వారు.

అంతేకాదు.. తామంతా .. బీఆర్ ఎస్‌ను సెక్యుల‌ర్ పార్టీ అనుకున్నామ‌ని.. కానీ, అక్క‌డ ఆత్మ‌గౌర‌వం లేద‌ని దానం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆత్మ‌గౌర‌వం లేని పార్టీ నుంచి టికెట్ ఎందుకు తీసుకున్నావు.. ? అని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు