Begin typing your search above and press return to search.

కొత్త సంక్షోభం... పాస్ పోర్ట్ కావాలంటే హెల్త్ ప్రోబ్లమ్ రావాలా?

ఇటీవల కాలంలో రాజకీయ సంక్షోభంతో ఇబ్బందులు పడిన నేపాల్ ను ఇప్పుడు మరో కొత్త సంక్షోభం పలకరించింది.

By:  Raja Ch   |   16 Nov 2025 12:00 AM IST
కొత్త సంక్షోభం... పాస్ పోర్ట్ కావాలంటే హెల్త్ ప్రోబ్లమ్ రావాలా?
X

ఇటీవల కాలంలో రాజకీయ సంక్షోభంతో ఇబ్బందులు పడిన నేపాల్ ను ఇప్పుడు మరో కొత్త సంక్షోభం పలకరించింది. ఇందులో భాగంగా... 2010 నుంచి ఈ ఏడాది వరకూ నేపాల్ కు పాస్ పోర్టులు అందిస్తున్న ఫ్రెంచ్ సంస్థ ఇడేమియా, పాస్ పోర్ట్ విభాగం మధ్య చర్చలు చివరి దశలో ఉండగా.. జర్మన్ సంస్థలు వెరిడోస్, ముహెల్ బౌర్ లు వచ్చే ఏడాది మార్చి 9 నుంచి పాస్ పోర్టులు సరఫరా చేయనుండగా.. ఈ రెండింటి మధ్య కాలంలో పాస్ పోర్టు ఎలా అందించాలనేది నేపాల్ సర్కార్ కు పెద్ద సమస్యగా మారింది.

అవును... నేపాల్ కు సరికొత్త సమస్య వచ్చింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పాస్ పోర్ట్ లు సరఫరా చేస్తున్న ఇడెమియా కంపెనీతో ఈ ఏడాది డిసెంబర్ 21తో ఒప్పందం ముగియనుండగా.. తదుపరి కంపెనీలు వచ్చె ఏడాది మార్చి నుంచి కొత్త పాస్ పోర్టులు సరఫరా చేయనున్న నేపథ్యంలో.. ఈ గ్యాప్ లో ఎలా? అనేది సమస్యగా మారింది. దీనికి తోడు ఈ రెండు సంస్థలతోనూ నేపాల్ పాస్ పోర్ట్ విభాగం పరిష్కారం దిశగా చేపట్టిన చర్చలు ఓ కొలిక్కి రావడం లేదని అంటున్నారు.

ఇందులో భాగంగా... కొత్త బయోమెట్రిక్ పాస్ పోర్ట్ లు డెలివరీ అయ్యేవరకూ సంప్రదాయ మెషిన్ రీడబుల్ పాస్ పోర్టులను సరఫరా చేయడానికి ఇడేమియాతో పాటు వెరిడోస్ తోనూ నేపాల్ పాస్ పోర్ట్ విభాగం చర్చలు కుదరడం లేదని అంటున్నారు. దానికి గల కారణాల్లో ఆర్ధికపరమైన భారం కూడా ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఇడేమియా ప్రస్తుతం ఒక్కో పాస్ పోర్ట్ ను భారత కరెన్సీలో రూ.898కు అందిస్తుండగా.. వెరిడోస్ రూ.763కే అందించనుందని అంటున్నారు.

అంతవరకు బాగానే ఉంది కానీ... తమతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా పాస్ పోర్టులు కావాలంటే అధిక మొత్తాన్ని చెల్లించాలని ఇడెమియా మెలికపెట్టింది. ఫలితంగా... ఒక మిలియన్ పాస్ పోర్టులకు నేపాల్ సర్కార్ పై అదనంగా రూ.1.34 కోట్ల భారం పడనుందని అంటున్నారు. ఇప్పుడు ఇదే కొత్త తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. తక్కువ ధరకు ఇచ్చే కొత్త కంపెనీలు ఉండగా స్వల్ప వ్యవధి కోసం ఇంత పెద్ద మొత్తం ఎందుకు వెచ్చించాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... విదేశాంగ మంత్రిత్వ శాఖను కూడా పర్యవేక్షించే ప్రధాన మంత్రి సుశీలా కర్కి జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21 - మార్చి 9 మధ్య స్టాప్ గ్యాప్ సరఫరాను నిర్ధారించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు, పాస్ పోర్ట్ విభాగం కలిసి.. అవుట్ గోయింగ్, ఇన్ కమింగ్ సరఫరాదారులతో చర్చలు ప్రారంభించాయని స్థానిక మీడియా వెల్లడించింది!

వాస్తవానికి ప్రస్తుతం పాస్ పోర్ట్ విభాగం వద్ద సాధారణ నిల్వ 1,70,000 కంటే తక్కువగా ఉందని చెబుతున్నారు. ఫలితంగా... ఆ విభాగం అంగీకరించే పాస్ పోర్టు దరఖాస్తుల సంఖ్యను బాగా తగ్గించారు. ఇందులో భాగంగా... గతంలో రోజుకు సుమారు 6,000 దరఖాసులను పొందగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 1,000కి తగ్గించారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి.. ప్రధానంగా హెల్త్ కండిషన్ భాగోక, చికిత్స కోసం వెళ్లేవారికి ప్రాధాన్యత ఇస్తూ పాస్ పోర్టులు జారీ చేస్తున్నారు!