Begin typing your search above and press return to search.

చిరుత బ్యూటీ ఎన్నికల ప్రచారం

రామ్‌ చరణ్‌ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతోనే హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ.

By:  Tupaki Desk   |   23 April 2024 5:34 AM GMT
చిరుత బ్యూటీ ఎన్నికల ప్రచారం
X

రామ్‌ చరణ్‌ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతోనే హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. అందంతో పాటు అభినయం విషయంలో ఈ అమ్మడు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. అయినా కూడా అదృష్టం కలసి రాకపోవడంతో ముద్దుగుమ్మ టాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కించుకోలేక పోయింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి సుదీర్ఘ కాలం అవుతున్నా కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ, రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉండటం ద్వారా ముద్దుగుమ్మ నేహా శర్మ కి నెట్టింట ఫాలోయింగ్‌ బాగానే ఉంది. హిందీ సినిమాలు మరియు సిరీస్‌ ల్లో కనిపిస్తూ సందడి చేసే నేహా తాజాగా ఎన్నికల ప్రచారం లో పాల్గొంది.

నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ భగల్‌పుర్ ఎంపీ స్థానంను ఇచ్చింది. ఆ స్థానం లో అజిత్ శర్మ గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేస్తున్నాడు. తండ్రికి మద్దతుగా నేహా శర్మ కూడా తనవంతు ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే నేహా శర్మ తాజాగా రోడ్‌ షో లో పాల్గొంది.

రోడ్డు షో లో పాల్గొన్న నేహా శర్మ ను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు హాజరు అయ్యారు. తన తండ్రిని గెలిపించాల్సిందిగా ఓటర్లకు నేహా శర్మ విజ్ఞప్తి చేశారు. మొన్నటి వరకు ఈ స్థానంలో నేహా శర్మ పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది.

నేహా శర్మ కు టికెట్టు ఇప్పించేందుకు అజిత్ శర్మ చాలా ప్రయత్నించాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మాత్రం ఆమెకు టికెట్టు ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో ఆ స్థానంలో అజిత్ శర్మ నే పోటీ చేశాడు. అజిత్ శర్మ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యేగా నేహా శర్మ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని స్థానిక రాజకీయ వర్గాల అంచనా