Begin typing your search above and press return to search.

నీట్ ఎఫెక్ట్‌: 190 మంది నిర్బంధం.. విష‌యం ఏంటంటే!

దేశ‌వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే నీట్ ప‌రీక్ష గ‌త నెల‌లోనే జ‌రిగింది.

By:  Garuda Media   |   9 Jun 2026 1:53 AM IST
నీట్ ఎఫెక్ట్‌: 190 మంది నిర్బంధం.. విష‌యం ఏంటంటే!
X

దేశ‌వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్ర‌వేశానికి నిర్వ‌హించే నీట్ ప‌రీక్ష గ‌త నెల‌లోనే జ‌రిగింది. ఫ‌లితాలు కూడా వ‌చ్చేశాయి. అయితే.. ఈ ప‌రీక్ష ప‌శ్న‌ప‌త్రం లీకైంద‌న్న స‌మాచారం.. దేశ‌వ్యాప్తంగా విద్యార్థుల‌ను, వారి త‌ల్లిదండ్రుల‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మ‌రోవైపు.. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) ఉద్య‌మం కూడా చేసింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో నీట్ ప‌రీక్ష‌ను ఈ నెల 21న మ‌రోసారి నిర్వ‌హిస్తున్నారు.

దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ నిర్వ‌హిస్తున్న నీట్ పునః ప‌రీక్ష‌కు సంబంధించి పేప‌ర్లు రెడీ అయ్యారు. ప్ర‌శ్న ప‌త్రాల త‌యారీ నుంచి తాజాగా ఎగ్జామ్ సెంట‌ర్ల ఏర్పాటుకు కూడా మార్గం సుగ‌మం అయింది. ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించే జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీఏ) ఏర్పాట్లు చేసింది. కాగా.. ఈ పునః ప‌రీక్ష ప్ర‌శ్న ప‌త్రాలను త‌ర‌లించేందుకు ఆర్మీకి చెందిన వైమానిక రంగాన్ని ఆశ్ర‌యించారు. ప్ర‌శ్న ప‌త్రాలను దేశ‌వ్యా ప్తంగా యుద్ధ విమానాల ద్వారా త‌ర‌లించ‌నున్నారు.

ఇదిలావుంటే.. పునః ప‌రీక్ష‌కు సంబంధించి ప్ర‌శ్న ప‌త్రాల‌ను రూపొందించిన విద్యావేత్త‌లు, ప్రొఫెస‌ర్ల‌ను ప్ర‌త్యేక కేంద్రంలో నిర్బంధించారు. ఒక‌ర‌కంగా దీనిని లాక్‌డౌన్‌గా కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. దాదాపు 190 మంది వ‌ర‌కు విద్యావేత్త‌లు, సీనియ‌ర్ ప్రొఫెస‌ర్లు, విష‌య నిపుణులు, స‌బ్జెక్టుల ఎక్స్‌ప‌ర్ట్స్ కూడా ఈ బృందంలో ఉన్నారు. వీరిని దేశంలోని వివిధ ప్రాంతాల‌కు త‌ర‌లించారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ప్ర‌త్యేక గ‌దుల్లో ఉంచారు. వీరు బ‌య‌ట‌కు రాకుండా గ‌ట్టి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు స‌హా ఇత‌ర‌త్రా గాడ్జెట్స్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. ప్ర‌శ్న ప‌త్రాల‌ను రూపొందించిన వారిని ఉంచిన కేంద్రాల వ‌ద్ద ఆర్మీతో ప్ర‌త్యేక భ‌ద్ర‌త‌ను క‌ల్పిం చారు. కేవ‌లం ఒక‌రిద్ద‌రు స‌హాయ‌కుల‌ను మాత్ర‌మే ఏర్పాటు చేసిన‌ట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. అయి తే.. వారు ఎక్క‌డ ఉన్నారు? అనే విష‌యాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. కాగా.. నీట్ ప్ర‌శ్న ప‌త్రానికి సంబంధించి ఈ త‌ర‌హా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డం దేశంలో ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.