Begin typing your search above and press return to search.

చంద్రబాబు స్థానంలో పవన్ కల్యాణ్.. ఢిల్లీలో కీలక సమావేశం!

ఇక రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

By:  Tupaki Desk   |   25 May 2025 1:37 PM IST
చంద్రబాబు స్థానంలో పవన్ కల్యాణ్.. ఢిల్లీలో కీలక సమావేశం!
X

ఢిల్లీలో ఆదివారం కీలక సమావేశం జరుగుతోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సయావేశంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బదులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక్కరే హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న చంద్రబాబు.. ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి మాత్రం హాజరుకాలేదు.

అయితే ఏపీ సీఎం చంద్రబాబు గైర్హాజరు వెనుక చెప్పుకోదగ్గ కారణమేదీ లేదని అంటున్నారు. ముందస్తు కార్యక్రమం ఉండటం వల్లే ఎన్డీఏ సీఎంల సమావేశానికి చంద్రబాబు హాజరుకాలేకపోయారు. ఆదివారం తన సొంత నియోజకవర్గంలో కుప్పంలో చంద్రబాబు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉండటంతో ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరుకాలేనంటూ ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత ఎన్నికల ముందు పవన్ పట్టుబట్టడంతోనే ఏపీలో కూటమిలో చేరిన బీజేపీ.. రాష్ట్రంలో వచ్చిన ఎంపీ స్థానాలతో వరుసగా మూడో విడత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. దీంతో పవన్ వల్లే ప్రధాని మోదీ 3.O సర్కారు కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశం కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాకిస్థానుతో ఉద్రిక్తతలు, యుద్ధం అనంతర పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ను అభినందిస్తూ ఓ తీర్మానం, దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలనే అంశమై మరో తీర్మానం చేయనున్నారు. మొత్తం 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది ఉప ముఖ్యమంత్రులతో సహా, కేంద్ర మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.