Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎన్డీఏ కూటమి...లిట్మస్ టెస్ట్ అపుడే ?

తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కానుందా అంటే అవును అని జవాబు వస్తోంది.

By:  Satya P   |   12 May 2026 8:15 AM IST
తెలంగాణలో ఎన్డీఏ కూటమి...లిట్మస్ టెస్ట్ అపుడే ?
X

తెలంగాణలో ఎన్డీఏ కూటమి ఏర్పాటు కానుందా అంటే అవును అని జవాబు వస్తోంది. ఇప్పటివరకు చూస్తే అక్కడ మూడు ప్రధాన పార్టీలు రాజకీయం చేస్తూ వస్తున్నాయి. ఒక ప్రధాన పార్టీగా అధికారంలో కాంగ్రెస్ ఉంది, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అయితే మూడో పక్షంగా వెనకన బీజేపీ కనిపిస్తోంది. బీజేపీకి పశ్చిమబెంగాల్ తర్వాత తెలంగాణ మీద ఒక్కసారిగా ఆశలు అధికమవుతున్నాయి. దాంతో 2028 లో జరిగే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కమలం జెండాను ఎగరవేయాలని బిజెపి కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమబెంగాల్ లో కొత్త ప్రభుత్వాన్ని బీజేపీ స్థాపించిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ల్యాండ్ అయ్యారు.

ఈ భేటీలు సీరియస్ :

ఆయన తెలంగాణాకు వస్తూనే తన వ్యూహాలను అమలులో తెచ్చినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి ఆంధ్రాలో ఎన్డీఏ మిత్రులుగా ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లని వారి ఇళ్లలోనే మోడీ వచ్చి కలిశారు. వాళ్లతో చాలా సేపు చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలలో వర్తమాన రాజకీయ విషయాలు చాలానే వచ్చేయని అంతా అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలన్నద్దే బీజేపీ పెద్దల లక్ష్యంగా కనిపిస్తోంది.

లిట్మస్ టెస్ట్ కోసం :

ఇక దానికి ముందు అంటే కొద్ది నెలల్లో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పోటీ పడాలని చూస్తోంది అని అంటున్నారు. అంటే ఇది లిట్మస్ టెస్ట్ లాంటిది అన్న మాట. మూడు పార్టీలకు జనాదరణ ఎలా ఉంది అన్నది ఈ ఎన్నికల్లో తెలుస్తుంది అని భావిస్తున్నారు. ఆంధ్ర పార్టీలుగా ముద్రపడ్డ జనసేన టిడిపిలను జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనాలు కనుక ఆదరిస్తే ఖచ్చితంగా 2028 నాటికి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి పోటీకి తయారుగా ఉంటుంది అని అంటున్నారు. ఇక చూస్తే ఇప్పటివరకు తెలంగాణ బిజెపి నేతలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన పార్టీ పెద్దలు ఇప్పుడు స్వయంగా తామే అన్నీ పర్యవేక్షించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ బిజెపి నేతలు పూర్తిస్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు అన్న నిర్ణయానికి కేంద్ర పెద్దలు వచ్చినట్టుగా చెబుతున్నారు.

గేర్ మార్చాల్సిందే :

తెలంగాణాలో ఎవరితోనూ పొత్తులు వద్దు తామే సొంతంగా అధికారులను బిజెపిని తెస్తామని చెప్పిన కాషాయం నేతలు తలోదిక్కుగా విడిపోయి వర్గ పోరుని పెంచి పోషిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే చర్యలకు దిగటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నాళ్లు గడిచిన బిజెపి ప్రతిపక్షంలోనే వెనక సీట్ లోనే ఉంటుంది అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. దాంతో గేర్ మార్చి స్పీడ్ పెంచాలని స్వయంగా నరేంద్ర మోడీ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని జనసేనను కలుపుకుంటే తెలంగాణ అంతటా క్షేత్రస్థాయిలో బిజెపికి అవసరమైన బలం సమకూరుతుందని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ని గట్టిగా ఢీ కొట్టి తాము అధికారంలో వచ్చేందుకు వీలు అవుతుందని బీజేపీ పెద్దలు నమ్మకంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తుల విషయంలో తెలంగాణ బిజెపి నేతల సూచనలు కాని వాళ్ళ అభ్యంతరాలను కానీ పట్టించుకునే అవకాశాలు ఏమాత్రం కనిపించట్లేదు. చంద్రబాబుతో పొత్తు వద్దు అని తెలంగాణ బిజెపి నేతలు గతంలో చెప్పి ఉన్నా కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. కేంద్ర బీజేపీ నేతలు చంద్రబాబుతోనూ పవన్ తోనూ పొత్తుకు కుదిరించే పనిలో ఉన్నారని అంటున్నారు. దాంతో తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి రాబోయే ఎన్నికలకు సంసిద్ధమైన సూచనలు స్పష్టంగా కనిపిస్తుంది దీంతో తెలంగాణ రాజకీయంలో పెను మార్పులు సంభవిస్తాయని అంతా అంటున్నారు.