Begin typing your search above and press return to search.

భారత్ గొప్పతనం పాక్ చెబితే ఆ కిక్కే వేరబ్బా...!

ఇపుడు చూస్తే పాకిస్థాన్ ని చాలా కాలం పాటు పాలించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అయితే భారత్ ని పొగుడుతూ పాకిస్థాన్ దుస్థితిని తలచి వాపోతున్నరు.

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:56 AM GMT
భారత్ గొప్పతనం పాక్ చెబితే ఆ కిక్కే వేరబ్బా...!
X

మన శత్రువు కోపంలోనో లేక మరో ఉద్దేశ్యంతో అయినా మన గురించి పొగిడితే ఆ కిక్కే వేరేగా ఉంటుందని కొత్తగా చెప్పాల్సింది లేదు. భారత్ అతి పెద్ద దేశం. అందులో ఒక ముక్క పాకిస్థాన్. మతపరంగా విడిపోయింది పాక్. భారత్ కంటే ఒక రోజు ముందే విడిపోయింది. సరిగ్గా చెప్పాలీ అంటే ఏడున్నర పదుల స్వతంత్ర జీవితం పాక్ కి కూడా ఉంది.

ఇంతటి సుదీర్ఘమైన ప్రయాణంలో పాక్ ఏమి సాధించింది అంటే భారత్ మీద పీకల దాకా కోపం, అసూయ, అక్కసు తప్ప ఏమీ కావని తేలింది. ఎంతసేపూ భారత్ ని బూచిగా చూపిస్తూ భారత్ వినాశనం కోరుకుంటూ పాక్ లోని పాలకులు పుణ్యకాలాన్ని గడిపేశారు. తీరా ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పులు తిప్పలు దరిద్రాలు తాండవిస్తూ పాక్ ని ఏమీ కాకుండా చేశాయి.

ఈ రోజున పాకిస్తాన్ అప్పుల కోసం ప్రపంచం చుట్టూ తిరుగుతోంది. భరత్ మీద పాకిస్థాన్ ద్వేషాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చాలా దేశాలు అప్పట్లో మద్దతు ఇచ్చాయి. అయితే ఇపుడు పాక్ నిండా చితికిపోయాక మాత్రం ముఖం చాటేస్తున్నాయి. ఈ పరిణామంతో పాక్ బెంబేలెత్తుతోంది. పాక్ పీకల్లోతు అప్పుల్లో మునిగి ఉంది. పాకిస్థాన్ లోని సగటు పౌరులు అంతా నరేంద్ర మోడీ పాలనను చూస్తున్నారు. మన దేశం సంగతేంటి అని బావురుమంటున్నారని వార్తలు వచ్చాయి.

ఇపుడు చూస్తే పాకిస్థాన్ ని చాలా కాలం పాటు పాలించిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అయితే భారత్ ని పొగుడుతూ పాకిస్థాన్ దుస్థితిని తలచి వాపోతున్నరు. భారత్ జీ 20 సదస్సుని గొప్పగా నిర్వహించింది. అదే టైం లో చంద్రమండలం మీదకు ఉప గ్రహాన్ని పంపించింది. అదే పాకిస్తాన్ ని చూస్తే పేదరికం, ప్రపంచం ముందు అడుక్కుంటోంది అని కఠిన సత్యాన్ని ముందు పెట్టారు.

మాకు అప్పు ఇవ్వండి బాబూ అని పాక్ ప్రధాని నేడు ప్రపంచం ముందు పడి అడుక్కుంటున్నాడని ఆయన ఘాటైన పదాలతో చెరిగేశారు. భారత్ సాధించిన ఘనతను పాక్ ఎందుకు సాధించలేకపోతోంది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. లాహోర్ లో జరిగిన పార్టీ నాయకుల సమావేశాన్ని ఉద్దేశించి లండన్ నుంచి ఆయన వర్చువల్ గా చేసిన ప్రసంగంలో ఈ హాట్ కామెంట్స్ చేశారు.

అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నపుడు భారత్ విదేశీమారక ద్రవ్యం విలువ ఒక బిలియన్ డాలర్లు మాత్రమే ఉంటే నేడు అది ఆరు వందల బిలియన్ డాలర్లకు ఎగబాకింది అని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ ఎక్కడికో చేరుకుంటే పాకిస్థాన్ మాత్రం అక్కడే ఉండిపోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పాక్ ఈ విధంగా దుస్థితికి చేరుకోవడానికి కారణం అధికారులు అని ఆయన ఆరోపించారు. వారే జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పాకిస్థాన్ ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన జైలు శిక్షను ఎదుర్కొంటున్నారు. లండన్ లో ఆయన గడుపుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో తన పార్టీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో పాక్ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్ మీద అవినీతి కేసులను తిరిగి పునరుద్ధరించింది. దాంతో షరీఫ్ ఇపుడు పాక్ అధికారుల మీద మండిపడుతున్నారు. ఇక పాక్ లో తాజా పరిస్థితి అయితే అక్కడ పౌరులను మండిస్తోంది. దాంతో వారంతా ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.