Begin typing your search above and press return to search.

భారత్ తో జాగ్రత్త.. తమ్ముడికి కీలక సూచన చేసిన నవాజ్

అనుభవానికి మించిన జ్ఞానం ఇంకేమీ ఉండదంటారు. ఇప్పుడు అలాంటి అనుభవాన్ని తన తమ్ముడికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధానమంతి నవాజ్ షరీఫ్.

By:  Tupaki Desk   |   29 April 2025 10:23 AM IST
భారత్ తో జాగ్రత్త.. తమ్ముడికి కీలక సూచన చేసిన నవాజ్
X

అనుభవానికి మించిన జ్ఞానం ఇంకేమీ ఉండదంటారు. ఇప్పుడు అలాంటి అనుభవాన్ని తన తమ్ముడికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధానమంతి నవాజ్ షరీఫ్. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి పాక్ ప్రధాని కం తన తమ్ముడు షెహబాజ్ కు కీలక సూచనలు చేస్తున్నారు తాజాగా తన సోదరుడ్ని కలిసి నవాజ్ ఆయనతో భారత్ తో వ్యవహరించాల్సిన తీరు గురించి చర్చించినట్లుగా చెబుతున్నారు.

రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సమిసిపోవాలంటే దౌత్య మార్గం ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. పహల్గాం దాడి అనంతరం భారత్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని నవాజ్ షరీఫ్ కు వివరిస్తూ.. భారత్ వల్లే ఉద్రిక్తతలు పెరిగినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన నవాజ్ షరీఫ్.. భారత్ తోదూకుడుగా వ్యవహరించొద్దని.. శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాల్ని వినియోగించుకోవాలని చెప్పినట్లుగా అక్కడి మీడియా చెబుతోంది.

నవాజ్ షరీఫ్ వైఖరికి తగ్గట్లే.. ఆయన కుమార్తె పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మర్యమ్ సైతం తాజా పరిణామాలపై ఇప్పటివరకు స్పందించని అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. పాక్ ప్రధానిగా వ్యవహరించిన నవాజ్.. తన పాలన సమయంలో ఆయన వేసిన ఎత్తులు.. భారత్ నుంచి ఎదురై తిప్పల మీద అనుభవం చాలానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధానికి తన అనుభంంతో కూడిన సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు. మరి.. పాక్ ప్రధానిపై తన అన్న నవాజ్ చెప్పిన మాటలు ఏ మేరకు ప్రభావితం చూపాయన్నది కాలమే డిసైడ్ చేయాలి.