Begin typing your search above and press return to search.

ఖతర్ లో భారత్ నేవీ ఆఫీసర్స్ కు మరణశిక్ష... అసలేం జరిగింది?

వివరాళ్లోకి వెళ్తే... భారత్‌ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు గతకొంతకాలంగా అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2023 1:58 PM GMT
ఖతర్  లో భారత్  నేవీ ఆఫీసర్స్ కు మరణశిక్ష... అసలేం జరిగింది?
X

భారత్‌ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు గతకొంతకాలంగా ఖతర్ లో పనిచేస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం వీరిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు.. దీంతో తాజాగా కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశం అయ్యింది. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది.

అవును... ఖతర్ లో తీవ్ర దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఇందులో భాగంగా... గూఢచర్యం ఆరోపణలతో ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులకు ఖతర్ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై భారత విదేశాంగశాఖ స్పందించింది.. ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పింది.. దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించింది.


వివరాళ్లోకి వెళ్తే... భారత్‌ కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారులు గతకొంతకాలంగా అల్‌ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతర్‌ సాయుధ దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఒమన్‌ కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో సబ్‌ మెరైన్‌ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

దీంతో... ఈ గూడచర్యానికి పాల్పడుతుంది వీరేనంటూ భారత్‌ కు చెందిన ఈ ఎనిమిది మందిని ఖతర్‌ అధికారులు గతేడాది ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో భారత్ లోని అధికారులతో మాట్లాడేందుకు ఖతర్‌ వీరికి అనుమతి ఇచ్చింది. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు వీరిని కలిశారు. అనంతరం ఖతర్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు.

ఇదే సమయంలో వీరి తరుపున చాలాసార్లు బెయిల్‌ కు కూడా ప్రయతించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నాటి నుంచీ వీరి నిర్బంధాన్ని ఖతర్‌ ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసు కోర్టులో విచారణకు వెళ్లింది. ఈ క్రమంలోనే అక్కడి న్యాయస్థానం ఈ ఎనిమిది మందికి తాజాగా మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.

దీంతో ఈ విషయంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఇందులో భాగంగా... ఈ వార్త తమనెంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని.. ఈ తీర్పునకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వేచిచూస్తున్నామని.. బాధితుల కుటుంబ సభ్యులతోపాటు న్యాయ బృందంతో టచ్‌ లో ఉన్నామని తెలిపింది.

ఇదే క్రమంలో... ఈ కేసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నామని.. చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాల కోసం అన్వేషిస్తున్నామని.. భారత విదేశాంగ శాఖ తెలిపింది. అయితే... గోప్యతకు సంబంధించిన కారణాల దృష్ట్యా ఈ కేసుపై ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువగా స్పందించలేమని తెలిపింది.