Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 1 విడుద‌ల‌- జ‌నం జేబుల‌కు ధ‌ర‌ల మోత‌!

దీంతో ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయి. ఫాస్ట్‌ట్యాగ్ నుంచి NPS వరకు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అనేక మార్పులు వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 March 2024 6:22 AM GMT
ఏప్రిల్ 1 విడుద‌ల‌- జ‌నం జేబుల‌కు ధ‌ర‌ల మోత‌!
X

రెండు రోజుల్లో కొత్త ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభం కానుంది. 2024-25 మొదలు కానుంది. అయితే.. ఈ సారి ఏప్రిల్ 1 మామూలుగా అయితే ఉండేలా క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. ఆర్బీఐ నిబంధ‌న‌ల్లో స‌ర‌ళ‌తం బ్యాంకుల‌కు విచ్చ‌ల‌విడి త‌నాన్ని పెంచేసింది. దీంతో ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నున్నాయి. ఫాస్ట్‌ట్యాగ్ నుంచి NPS వరకు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అనేక మార్పులు వ‌స్తున్నాయి.

పెన్షన్ రెగ్యులేటర్ PFRDA, నేషనల్‌ పెన్షన్‌ సిస్టం (NPS) ఖాతాలోకి లాగిన్ అయ్యే నిబంధన మార్చింది. 1 ఏప్రిల్‌ నుంచి, NPS ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి యూజర్ ID & పాస్‌వర్డ్ మాత్రమే సరిపోదు. మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ కూడా అవసరం. NPS ఖాతా లాగిన్ కోసం యూజర్ ID, పాస్‌వర్డ్ ఎంటర్‌ చేయగానే, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని కూడా నమోదు చేసిన తర్వాత మాత్రమే NPS ఖాతాలోకి వెళ్లగలరు.

కీల‌క‌మైన 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (ఈపీఎఫ్‌ఓ) నిబంధనల్లో ఏప్రిల్‌ 1 నుంచి అతి పెద్ద మార్పు రానుంది. కొత్త ఆర్థిక సంవత్సరం (2024-25) నుంచి, ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని EPF ఖాతా ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. ఇప్పటి వరకు ఖాతాదారు అభ్యర్థనపై మాత్రమే ఖాతాను బదిలీ చేసేవాళ్లు.

ఏప్రిల్ 1 నుంచి, కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది. మీరు పాత లేదా కొత్త పన్ను విధానంలో ఏదో ఒకటి ఎంచుకోకపోతే, మీ ITR కొత్త పన్ను విధానంలోనే ఫైల్‌ అవుతుంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, అదే పద్ధతిలో ITR పైల్‌ చేయవచ్చు. కొత్త పన్ను విధానంలో రూ. 7 లక్షల వరకు ఆదాయంపై ఒక్క రూపాయి కూడా టాక్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఫాస్టాగ్ యూజర్లు మార్చి 31 లోగా KYC అప్‌డేట్ చేయాలని NHAI సూచించింది. అలా చేయడంలో విఫలమైతే 01 ఏప్రిల్‌ నుంచి ఆ ఫాస్టాగ్ ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. ఇదే జరిగితే, ఖాతాలో డబ్బు ఉన్నప్పటికీ టోల్ గేట్‌ దగ్గర చెల్లింపులు చేయలేరు.

కోట్లాది మంది ఖాతాదార్లకు షాక్ ఇస్తూ, దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్‌ SBI వివిధ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీని ఏకంగా 75 రూపాయలు పెంచాలని నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 01 నుంచి అమల్లోకి రానుంది. దీంతో పాటు, క్రెడిట్ కార్డ్ వినియోగదార్లకు కూడా ఝలక్‌ ఇచ్చింది. SBI క్రెడిట్‌ కార్డ్‌తో చేసే అద్దె చెల్లింపుపై లభించే రివార్డ్ పాయింట్లను ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తోంది.

'నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్' కింద కొన్ని అత్యవసర ఔషధాల ధరలను 0.0055 శాతం పెంచుతున్నట్లు భారత ఔషధ ధరల నియంత్రణ సంస్థ ప్రకటించింది. ఈ ప్రకారం, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫెక్షన్ మందుల ధ‌ర‌లు పెరుగుతాయి.