Begin typing your search above and press return to search.

జాతీయ జెండా ఎగరవేసేటప్పుడు రూల్స్ ఇవే... డ్రెస్ లో కండిషన్స్ అప్లై!

ఇక ఈ జాతీయ జెండాను ఖాదీ, కాటన్, సిల్క్‌ తో మాత్రమే తయారు చేయాలి.

By:  Tupaki Desk   |   13 Aug 2023 4:29 AM GMT
జాతీయ జెండా ఎగరవేసేటప్పుడు  రూల్స్ ఇవే... డ్రెస్  లో కండిషన్స్  అప్లై!
X

బ్రిటీష్ రాక్షస పాలన నుంచి భారతదేశానికి విముక్తి లభించి ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగిరిన సందర్భంగా... భారతమాత స్వేఛ్చా వాయువులు పీల్చుకున్న రోజైన ఆగస్టు 15న ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటాం.ఈ సమయంలో జాతీయ జెండా ఎగరవేసేటపుడు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఓసారి తెలుసుకుందాం!

1947 జూలై 27 న రాజ్యాంగ సభ ఆమోదించినప్పటి నుంచి మనం జాతీయ జెండాను ఎగురవేస్తున్నాం. ఈ త్రివర్ణ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. ఈ మూడు రంగుల్లో కాషాయం రంగు దేశ పటిష్టత, ధైర్యానికి ప్రతీక. మధ్యలో ఉండే తెలుపు శాంతికి చిహ్నం కాగా... ఆకుపచ్చ దేశ ప్రగతికి ప్రతీక!

ఇదే సమయంలో స్కూలు పిల్లల జాతీయ గీతం.. "రింగు రింగున సాగిపోవు రంగు రంగుల జెండా.. ఓ రంగు రంగుల జెండా" లో... ఎరుపు రంగు - త్యాగానికి గుర్తని, తెలుగు రంగు - పవిత్రతకి గుర్తని, ఆకుపచ్చ రంగు - పాడి పంటలకు గుర్తని ఉంటుంది. జాతీయ పతాకంలో 24 ఆకులతో నీలం రంగులో ఉండే అశోక చక్రం.. ధర్మాన్ని సూచిస్తుంది.

ఇక ఈ జాతీయ జెండాను ఖాదీ, కాటన్, సిల్క్‌ తో మాత్రమే తయారు చేయాలి. పొడవు, వెడల్పులు ఖచ్చితంగా 2:3 నిష్సత్తిలో ఉండేలా చూసుకోవాలి. 9 రకాల సైజుల్లో జాతీయ జెండాను తయారు చేసుకోవచ్చు. జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ పై నుంచి కిందకు వచ్చేలా ఎగరవేయాలి.

అదేవిధంగా... ప్లాస్టిక్‌ తో జెండాలు తయారు చేయకూడదు. కాగితంతో జెండాలు చేసుకోవచ్చు కానీ అవి చిన్న సైజులో ఉండేలా చూసుకోవాలి. జెండాలో తెలుపురంగు మధ్యలో అశోక చక్రం 24 ఆకులు కలిగి నీలం రంగులో ఉండాలి. ఇదే సమయంలో జాతీయ జెండాను సూర్యోదయం తరువాత ఎగరేయాలి. సూర్యాస్తమయానికి ముందే దించాలి! ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటించాలి.

జాతీయ జెండా రంగుల్లో దుస్తులు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

జాతీయ జెండా రంగుల్లో దుస్తులు ధరించడంలో తప్పు లేదు. అయితే దానికి సంబంధించిన కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. దీనికి సంబంధించి 2005లో లోక్‌ సభ ఒక బిల్లును ఆమోదించింది. ఇందులో భాగంగా... 2005లోని సెక్షన్ 2 (ఇ) ప్రకారం జాతీయ జెండాను ఎవరూ నడుము కింద్రి నుంచే ధరించే దుస్తుల్లో వాడరాదు. జాతీయ జెండాను ఎలాంటి డ్రెస్ మెటీరియల్ పైన ముద్రించకూడదు!

ఇదే సమయంలో కుషన్లు, రుమాలు, లో దుస్తులు వంటి రోజువారి ఉపయోగంలో జాతీయ జెండా రంగులను కలిపి వాడరాదు. కోడ్ ను ఉల్లంఘిస్తే కనీసం సంవత్సరకాలం జైలు శిక్ష విధిస్తారు. మూడు రంగుల టీ షర్టు, చీర, దుపట్టా లేదా తలపాగా వంటివాటిలో రంగులు చేర్చుకోవచ్చు.