ఏడు, పదో తరగతి పిల్లల బ్యాగుల్లో కం**మ్స్, కత్తులా ? నాసిక్‌లో షాకింగ్ సీన్!
ఇదిలా ఉండగా.. విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేసే స్కూల్ ప్రయత్నాన్ని తల్లిదండ్రులు స్వాగతించారు.
By: Tupaki Desk | 9 April 2025 9:38 AM ISTమహారాష్ట్రలోని నాసిక్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఘోటిలోని ఒక స్కూల్‌లో 7 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లల బ్యాగుల్లో కం**మ్స్ ప్యాకెట్లు, కత్తులు, పేకాట కార్డులు ఇంకా చాలా అభ్యంతరకరమైన వస్తువులు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయం గురించి స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ మీడియాతో మాట్లాడుతూ.. తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ వస్తువులు బయటపడ్డాయని చెప్పారు. "పిల్లల బ్యాగుల్లో కనిపించిన అభ్యంతరకరమైన వస్తువులు ఒకేసారి దొరకలేదు. గత కొద్ది రోజులుగా వేర్వేరు విద్యార్థుల బ్యాగుల్లో వేర్వేరు వస్తువులు కనిపిస్తున్నాయి. విద్యార్థుల్లో నేర ప్రవృత్తి పెరగకుండా నిరోధించడానికి, ప్రతిరోజూ వారి బ్యాగులను తనిఖీ చేస్తాము" అని వైస్ ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేసే స్కూల్ ప్రయత్నాన్ని తల్లిదండ్రులు స్వాగతించారు. ఒక విద్యార్థి తల్లి మాట్లాడుతూ.. "స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్ అమలు చేస్తున్న ఈ ప్రయత్నం సరైనది. ఎందుకంటే ఇది తప్పుదోవ పట్టించే వయస్సు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు మంచి నీతులు నేర్పేది ఉపాధ్యాయులు మాత్రమే. కాబట్టి మేము ఈ ప్రయత్నానికి మద్దతు ఇస్తున్నాము" అని అన్నారు.
