Begin typing your search above and press return to search.

19 రోజులకే ఏడాది.. భూమిని పోలిన గ్రహాన్ని గుర్తించిన నాసా

By:  Tupaki Desk   |   5 Feb 2024 5:04 AM GMT
19 రోజులకే ఏడాది.. భూమిని పోలిన గ్రహాన్ని గుర్తించిన నాసా
X

భూమి మాదిరి ఉండే గ్రహం కోసం అన్వేషణ ఇప్పటిది కాదు. వందల ఏళ్లుగా సాగుతున్న ఈ వెతుకులాటలో ఇప్పటివరకుపెద్దగా లభించింది ఏమీ లేదు. ఈ విశ్వంలో మనిషి మాత్రమేనా? అతడు ఒంటరా. అతనికి తోడుగా వేర్వేరు గ్రహాలు ఏమైనా ఉన్నాయా? అన్న కుతూహలం.. ఆసక్తి ఎప్పటి నుంచో ఉన్నదే. తాజాగా అమరికాకు చెందిన అంతరిక్ష్ పరిశోధన సంస్థ (నాసా) తాజాగా భూమిని పోలిన ఒక గ్రహాన్ని గుర్తించారు.

అచ్చం భూమిలా ఉండే సూపర్ ఎర్త్ ను నాసా గుర్తించింది. ఇది మనకు 137 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఒక రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నట్లుగా గుర్తించారు. భూమితో పోలిస్తే దాదాపు ఒకటిన్నర రెట్లు పెద్దదిగా ఉందని చెబుతున్నారు. సూర్యుడు కాకుండా విశ్వంలోని ఇతర నక్షత్ర వ్యవస్థల్లో మన భూమి కన్నా పెద్దగా.. నెఫ్ట్యూన్.. యురెనెస్ కంటే చిన్నగా ఉంటే వాటిని సూపర్ ఎర్త్ లుగా పిలుస్తుంటారు. తాజాగా గుర్తించిన భూమిని పోలి ఉన్న భూగ్రహాన్ని టెస్ ద్వారా గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఇంతకూ టెస్ అంటే.. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ గా వ్యవహరిస్తారు. దీని సాయంతో విశ్వంలో భూమిని పోలినగ్రహాలు ఏమైనా ఉంటాయా? అన్నది చెక్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా భూమిని పోలిన భూ గ్రహాన్ని గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం మన సూర్యుడి కన్నా చిన్నగా.. చల్లగా ఉండే నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతున్నట్లుగా గుర్తించారు. భూమి మాదిరే ఇది కూడా నక్షత్రం చుట్టూ తిరుగుతున్న విషయాన్ని కనుగొన్నారు.

ఈ సూపర్ ఎర్త్ కేవలం 19 రోజులకే ఒకసారి తన నక్షత్రాన్ని చుట్టి వస్తుందన్న విషయాన్ని గుర్తించారు. అంటే.. ఈ గ్రహంలో ఏడాది పూర్తి అవుతుందన్న మాట. అంటే.. మన భూమి లెక్కన అయితే.. నెలకు రెండు ఏళ్లు అక్కడ పూర్తి అవుతాయని చెప్పాలి.

కొత్తగా కనుగొన్న ఈ గ్రహంపైన నీళ్లు.. వాతావరణం ఉండే వీలుందని భావిస్తున్నారు. మరిన్ని వివరాల్ని సేకరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రహంతో పాటు భూమి కంటే కాస్తంత పెద్దగా ఉన్న మరో గ్రహాన్ని కూడా గుర్తించినట్లుగా వెల్లడించారు. అయితే.. ఈ గ్రహం మీద మరింత అధ్యయనం చేయాల్సి ఉందని చెబుతున్నారు.