Begin typing your search above and press return to search.

మోడీ హయాంలో 19 మంది జర్నలిస్టుల హత్య.. చెప్పిందెవరంటే?

సంచలన అంశాన్ని ప్రస్తావించారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు.. ది హిందూకు మాజీ ఎడిటర్ అయిన ఎన్ రామ్

By:  Tupaki Desk   |   28 Jan 2024 2:30 PM GMT
మోడీ హయాంలో 19 మంది జర్నలిస్టుల హత్య.. చెప్పిందెవరంటే?
X

సంచలన అంశాన్ని ప్రస్తావించారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు.. ది హిందూకు మాజీ ఎడిటర్ అయిన ఎన్ రామ్. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంతో పోలిస్తే.. ప్రధానిగా మోడీ పాలన సాగించిన పదేళ్ల కాలంలో దేశంలో జర్నలిస్టుల హత్యల సంఖ్య పెరిగినట్లుగా ఆయన వెల్లడించారు. తాను చెప్పిన సమాచారానికి ఆయన ఆధారాల్ని చూపటం గమనార్హం.

జర్నలిస్టుల భద్రతా కమిటీ గణాంకాలనే తాను ప్రస్తావిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 19 మంది జర్నలిస్టులు హత్యకు గురైనట్లుగా వెల్లడించిన ఆయన.. అంతకు ముందు ప్రభుత్వంతో పోలిస్తే రెట్టింపు హత్యలు జరిగినట్లుగా వెల్లడించారు. ఈ మధ్యన తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ను ఒక ప్రైవేటు టివీ చానల్ ఎడిటర్ ఇంటర్వ్యూ చేశారు. దీనిపై చానల్ ఎడిటర్ పై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీంతో.. ఆయన వ్యాఖ్యలపై చెన్నైలోని ఎడిటర్లు నిరసన తెలిపారు. గతంలోనూ పలువురు అధినేతలు పత్రికా స్వేచ్ఛకు పరిమితులు విధించిన వైనాన్ని గుర్తు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో బీజేపీ నేతలు ప్రచారం కోసం వెతుక్కుంటున్నట్లుగా పేర్కొన్న ఆయన.. రాజీవ్ గాంధీ హయాంలోనూ ప్రతికాస్వేచ్ఛను హరించేలా చేపట్టిన చర్యల్ని గుర్తు చేశారు. తమిళనాడుకు చెందిన కరుణా నిధి.. జయలలిత లాంటి నేతలు పాత్రికేయులతో వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. మొత్తంగా తమిళనాడులో బీజేపీ నేతల తీరుతో పాటు.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా స్వేచ్ఛకు సంబంధించిన అంశాల్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.