Begin typing your search above and press return to search.

మ‌రో ఐదేళ్లు మీరు అక్క‌డే కూర్చోండి.. పార్ల‌మెంటు వేదిగా మోడీ విరుస్లు

పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు. మ‌రో ఐదేళ్ల‌పాటు అక్క‌డే వారు కూర్చోవాల‌ని అన్నారు

By:  Tupaki Desk   |   6 Feb 2024 12:15 AM GMT
మ‌రో ఐదేళ్లు మీరు అక్క‌డే కూర్చోండి.. పార్ల‌మెంటు వేదిగా మోడీ విరుస్లు
X

పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు. మ‌రో ఐదేళ్ల‌పాటు అక్క‌డే వారు కూర్చోవాల‌ని అన్నారు. భార‌త దేశంలో వారు ప్ర‌జ‌ల‌ను విశ్వ‌సించ‌ర‌ని, పొరుగు దేశాల‌పై ఉన్న ప్రేమ వారికి సొంత దేశ ప్ర‌జ‌లపై లేద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. తాజాగా పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై ప్ర‌ధాని ఏక‌బిగిన దాదాపు రెండు గంట‌ల పాటు ప్ర‌సంగించారు. ఆసాంతం కాంగ్రెస్‌పైనా.. విప‌క్ష పార్టీల‌పైనా ఆయ‌న నిప్పులు చెరిగారు. అదేస‌మ‌యంలో ఆయ‌న ఇండియా కూట‌మి పార్టీల దౌర్బ‌ల్య‌త్వాన్ని ఆయ‌న ఎండ‌గ‌ట్టారు.

''విప‌క్ష పార్టీలో నేత‌ల‌కు ఇప్పుడున్న చోట పోటీ చేసే దైర్యం లేదు గ‌త ఎన్నిక‌ల్లోనే స్థానాలు మార్చుకుని చ‌చ్చీచెడీ గెలిచారు'' అంటూ.. ప‌రోక్షంగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘‘మీలో చాలామంది ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కూడా కోల్పోయారని నేను చూస్తున్నాను” అని ఎద్దేవా చేశారు. అంతేకాదు.. కొన్ని పార్టీల నాయ‌కులు లోక్‌సభకు బదులు రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నాయ‌ని అన్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం బీజేపీ వైపే దేశం ఉంది.. ఈ దేశ ప్ర‌జ‌లు బీజేపీ పాల‌న‌వైపే ఉండ‌డం. అని ప్ర‌ధాని బిగ్గ‌ర స్వ‌రంతో చెప్పుకొచ్చారు.

విభజన వాద రాజ‌కీయాల‌కు ఓ పార్టీ ఇంకా ప్ర‌య‌త్నిస్తూనే ఉంద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. ఇలా ఎంతకాలం ఆలోచిస్తారు? సమాజాన్ని విడదీస్తూ ఇంకెంతకాలం ఉంటారు? అని నిల‌దీశారు. ''ఒకే ప్రోడక్ట్‌ని పదే పదే లాంచ్ చేసి చివరికి తన దుకాణానికి తాళం వేసే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుంది'' అని ప‌రోక్షంగా సోనియా, రాహుల్ గాంధీల నాయ‌క‌త్వంపై మోడీ విరుచుకు ప‌డ్డారు. ''కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూడండి. ఖర్గే (కాంగ్రెస్ జాతీయ అధ్యుడు) సభ నుంచి వెళ్లిపోయారు.(ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌బ‌లోఉన్నారు) గులాం నబీ ఆజాద్ (కాంగ్రెస్ మాజీ నేత) పార్టీని వదలి వెళ్లారు'' అని నిప్పులు చెరిగారు.

మ‌ళ్లీ మేమే..

కేంద్రంలో మూడో సారి ముచ్చ‌ట‌గా తామే అధికారంలోకి రానున్న‌ట్టు ప్ర‌ధాని ధీమా వ్య‌క్తం చేశారు. వంద రోజుల్లో మూడోసారి మేం అధికారంలోకి రానున్నాం.. అనిలోక్‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ''అబ్ కీ బార్ మోదీ సర్కార్ అని ఖర్గే కూడా అంటున్నారు. బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని, ఎన్డీయేకు 400కు పైనే సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఏదేమైనా ప్ర‌జ‌లు మాతోనే ఉన్నారు. మావైపే ఉన్నారు. మాలోనే ఉన్నారు. మేమే వ‌స్తున్నాం!'' అని పార్ల‌మెంటు వేదిక‌గా ప్ర‌ధాని ఎలుగెత్తి చాటారు.