Begin typing your search above and press return to search.

మోడీతో పాటే మనమూ ఎన్నికలకు పోదాం...!

కేంద్రంలో నరేంద్ర మోడీ ఎలా ఆలోచిస్తే అలా అనుసరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం గా ఉంది అని అంటున్నారు

By:  Tupaki Desk   |   20 Sep 2023 10:10 AM GMT
మోడీతో పాటే మనమూ ఎన్నికలకు పోదాం...!
X

కేంద్రంలో నరేంద్ర మోడీ ఎలా ఆలోచిస్తే అలా అనుసరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం గా ఉంది అని అంటున్నారు. అది ఎన్నికల విషయంలో అని తెలుస్తోంది. ఏపీలో ముందస్తు వస్తాయా రావా అన్న చర్చ అంతా ఆ మధ్య దాకా నడిచింది. అయితే ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్ణయం తీసుకుని తానుగా ఎన్నికలకు వెళ్ళదని అంటున్నారు.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికల పేరిట ముందస్తు కు వెళ్తే లోక్ సభతో పాటే ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కేంద్రం జమిలి ఎన్నికల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అంతా అనుసరించాలని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది.

కేంద్రం ఒక వేళ జమిలి అని ఎన్నికలను ముందుకు నడిపినా లేక షెడ్యూల్ ప్రకారం 2024 మే లో ఎన్నికలు పెట్టినా కూడా సిద్ధంగా ఉండాలని జగన్ మంత్రులకు చెప్పినట్లుగా పేర్కొంటున్నారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా అంతా సిద్ధం కావాలని ఆయన మంత్రులకు దిశా నిర్దేశం చేశారని అంటున్నారు.

ఇప్పటి నుంచే క్ష్త్ర స్థాయిలో ప్రజలతో అనుసంధానం కావాలని ఆయన కోరినట్లుగా తెలుస్తోంది. ఇక మీదట అంతా పెద్ద ఎత్తున ప్రజలతో గడపాలని కూడా డైరెక్షన్ ఇచ్చారని అంటున్నారు ఇదిలా ఉంటే కేంద్రం ఆలోచనలు అయితే ప్రస్తుతానికి జమిలి నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 24 న జమిలి ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అధ్యక్షత తొలి మీటింగ్ జరగనుంది.

అదే విధంగా చూసుకుంటే దాని కంటే ముందు అంటే ఈ నెల 22తో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ముగుస్తాయి. ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికల కోసం బిల్లు వస్తుందని అనుకున్నారు కానీ మిగిలింది కేవలం రెండు రోజులు మాత్రమే అంటున్నారు. మహిళా బిల్లు ప్రత్యేక సమావేశాలకే స్పెషల్ అని అంటున్నారు.

దాంతో ఈసారి సమావేశాలు ముగుస్తాయని తెలుస్తోంది. మరి జమిలి ఎన్నికలు అంటే అది చాలా పెద్ద ప్రోసెస్. మరి కొద్ది రోజులలో అయిదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రానున్న క్రమంలో జమిలి ఇపుడు అంటే కుదిరేది కాదని అంటున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటున్నారు. మోడీ కూడా ఎన్నికలకు చాలా దూరం ఉంది అని పార్టీ నేతలతో కామెంట్స్ చేసినట్లుగా ప్రచారం సాగింది.

దీన్ని బట్టి చూస్తే జమిలి ఎన్నికలు అయితే ఉండవని అంటున్నారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలను అసలు కోరుకోవడం లేదు అని అంటున్నారు. ఇపుడు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయ పరిణామాలు కాస్తా వేడిగా ఉన్నాయి. దాంతో ఇవన్నీ సర్దుమణిగిన తరువాతనే ఎన్నికలకు వెళ్తే అసలు తీర్పు జనం నుంచి వస్తుంది అన్న ఆలోచనలు ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే ప్రభుత్వానికి గట్టిగా ఎనిమిది నెలలు టైం ఉన్నందువల్ల విలువైన ఆ సమయాన్ని వాడుకుందుకు చూస్తుందని అంటున్నారు. సో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే అంటున్నారు.