Begin typing your search above and press return to search.

మొదటి నుండి మోడీ ఇంతే

ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి నరేంద్రమోడీ వ్యవహార శైలి ఇలాగే ఉంటోంది

By:  Tupaki Desk   |   26 July 2023 9:17 AM GMT
మొదటి నుండి మోడీ ఇంతే
X

ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి నరేంద్రమోడీ వ్యవహార శైలి ఇలాగే ఉంటోంది. ప్లార్లమెంటు సమావేశాలంటే లెక్కలేదు. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్న బాధ్యతలేదు. సభలో మాట్లాడాల్సిన మాటలను బయటెక్కడో మాట్లాడుతారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు పార్లమెంటు బయట సమాధానాలు చెబుతారు. ఇపుడు కూడా అదేచేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుండి పార్లమెంటు ఉభయ సభల్లో మణిపూర్ అల్లర్లపై అట్టుడికిపోతోంది. మణిపూర్ అల్లర్లపై చర్చలు జరగాలని, నరేంద్రమోడీయే స్వయంగా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే మోడీ మాత్రం ప్రతిపక్షాలను లెక్కేచేయటంలేదు. పార్లమెంటు హాజరుకారు ఒకవేళ అయినా సమాధానాలు చెప్పరు. మొదటినుండి మోడీ వ్యవహార ఇలాగే ఉంటోంది. ఇపుడు కూడా పార్లమెంటులో అంత గోల జరుగుతుంటే బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మోడీ మాట్లాడుతు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల కొత్తకూటమికి ఇండియా అని పేరు పెట్టడాన్ని మోడీ ఎగతాళి చేశారు. అది ఇండియా కాదని ఈస్ట్ ఇండియా కంపెనీ అంటు ఎద్దేవా చేశారు. ఉగ్రసంస్ధల పేర్లలో కూడా ఇండియా ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు.

అంటే మోడీ ఉద్దేశ్యంలో ఇండియా కూటమి అన్నది ఉగ్రవాద సంస్ధలాంటిదన్నమాట. దేశంపేరును కూటమికి పెట్టుకుని ప్రజలను కొత్త కూటమి మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు మండిపోయారు. ప్రతిపక్షాలకు ఒక దిశానిర్దేశంలేదన్నారు. 2024 ఎన్నికల్లో కూడా జనాలు మళ్ళీ బీజేపీనే గెలిపిస్తారన్న ధీమాను వ్యక్తంచేశారు.

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇండియా కూటమి ఏర్పాటుపై నోటికొచ్చింది మాట్లాడిందే పార్లమెంటులో మాట్లాడుంచ్చు. కానీ మోడీ ఆ పనిచేయరు. ఎందుకంటే ఉభయసభల్లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేంత ధైర్యంలేదు. మణిపూర్లో రెండున్నర నెలలుగా అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయో చెప్పరు.

అక్కడి ప్రభుత్వం, ముఖ్యమంత్రి అల్లర్లను అణిచివేయటానికి ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పరు. అల్లర్లు పునరావృతం కాకుండా కేంద్రం తీసుకోబోయే చర్యలేంటో వివరించరు. మణిపూర్లో అల్లర్లు మొదలైన రెండున్నర నెలలకు కానీ అసలు మోడీ మాట్లాడలేదు. అదికూడా పార్లమెంటు మొదలయ్యే ముందు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన బయటపడింది కాబట్టే మాట్లాడారంతే.