ప్రపంచలోనే మొదటి స్థానానికి చేరుకున్న మోడీ.. మార్నింగ్ కన్సల్ట్ లో ఆశ్చర్యపరిచే విషయాలు
గ్లోబల్ నేత అన్న పదానికి సరిగ్గా సరిపోయే వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేవలం దేశంతోనే ఆయన ప్రభ ఆగలేదు.
By: Tupaki Desk | 26 July 2025 4:00 PM ISTగ్లోబల్ నేత అన్న పదానికి సరిగ్గా సరిపోయే వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కేవలం దేశంతోనే ఆయన ప్రభ ఆగలేదు. ప్రపంచం యావత్తు ఆయనను వేనోళ్లలో పొగడ్తలతో ముంచెత్తుతోంది. ఇప్పటికే మోడీ ఖాతాలో వందలాది రికార్డులు చేరాయి. అందునా ఆయా దేశాల వారు ఆయా దేశానికి సంబంధించి ఇచ్చే అత్యంత విలువైన గౌరవ సన్మానాలను ఆయన వందలాది దేశాల్లో అందుకున్నారు. అందుకే ఆయన గ్లోబల్ లీడర్ గా మారారు. ఇది యుద్ధాల కాలం కాదని, అభివృద్ధి కాలమని రష్యా, ఉక్రేయిన్ యుద్ధం సమయంలో చెప్పిన నేత మోడీ. ప్రపంచం ఆనందంగా ఉండాలంటే అభివృద్ధి, స్నేహ భావం ప్రధానంగా ఉండాలన్నారు. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించే అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా మోడీని పొగడకుండా ఉండలేకపోతున్నాడంటే ఆయన ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
2014లో మోడీ భారత ప్రధానిగా పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి తరుచూ విదేశాలకు వెళ్లేవారు. అప్పట్లో ఆయనపై ప్రతిపక్షాలు కూడా గుర్రుగా ఉన్నాయి. దేశంలో కనిపించడం లేదంటూ విమర్శలు గుప్పించాయి. కానీ వాటిని మోడీ పట్టించుకోలేదు. ‘ప్రపంచంతో దోస్తీ పెంచితేనే భారత్ అభివృద్ధి చెందుతుందని అందుకే నేను దేశాలు తిరుగుతున్నా’ అని చాలా ప్రసంగంలో చెప్పుకచ్చారు మోడీ. ఆయన ఏ దేశంలో ఎళ్లినా అక్కడ భారత కీర్తి ఎగిసిపడేది. ఆయనకు ఉన్నతమైన సత్కారాలు చేసి పంపేవారు. భారతదేశం గొప్పతనం ఆ గొప్ప దేశానికి ప్రధానిగా మోడీ వ్యవహరిస్తున్న తీరును చూసి చాలా దేశాలు పాదాభివందనం చేస్తున్నాయి. ఇప్పటికీ ప్రపంచంలోని చాలా దేశాల సాధారణ పౌరులకు కూడా మోడీ తెలుసంటే ఆశ్చర్యం వేయకమానదు.
ఇటీవల ఆయన అరుదైన కీర్తి ఘటించారు. ‘ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నేత’గా మోడీ నిలిచారు. ఇది దేశానికి గర్వకాణమని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ గ్లోబల్ లీడర్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత విశ్వసనీయ నేతగా గుర్తింపు పంపాదించుకున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ నేత అమిత్ మాలవీయ పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. భారత్ తో పాటు ప్రపంచంలోని చాలా దేశాల ప్రధానులు, అధ్యక్షులతో పాటు ప్రజలు విశ్వసించే నేతగా మోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం భారత్ సురక్షితమైన వ్యక్తి చేతుల్లో ఉందని మాలవీయ పోస్ట్ లో పేర్కొన్నారు.
మార్నింగ్ కన్సల్ట్ ఈ నెల (జూలై) 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సర్వే నిర్వహించింది.
జూలై 4వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య ఇందులో ఆసక్తికరంగా మోడీ 75 శాతం మద్దతుతో మొదటి స్థానంలో నిలిచారు. దక్షిణ కొరియా (సౌత్ కొరియా) అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ రెండో స్థానంలో నిలిచారు. ఇతనికి 57 శాతం మద్దతు లభించింది. తర్వాతి స్థానంలో అర్జెంటినా అధ్యక్షుడు జేవియర్ మిలి, తర్వాతి స్థానంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఉన్నారు. అయితే ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకుంటున్న అమెరికాకు చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 44 శాతం మద్దతుతో 8వ స్థానంలోకి వెళ్లారు.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ ఉన్న వ్యక్తిగా మోడీ అనేక సందర్భాలలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ 2021, సెప్టెంబర్ లో కూడా ఇదే సర్వే నిర్వహించింది. ఇందులో కూడా 70 శాతం మద్దతుతో ప్రధాని అగ్రభాగాన ఉన్నారు. 2022లో 71 శాతంతో ప్రపంచంలో మొదటి స్థానానికి వెళ్లారు. 2024లో కూడా 78 శాతం దక్కించుకొని మొదటి స్థానాన్ని ఆక్రమించారు.
