Begin typing your search above and press return to search.

మోడీ బెంగాల్ సీఎం గానా-మమత చూపు పీఎం సీటు పైనా !

ప్రధాని నరేంద్ర మోడీది ఒక విలక్షణమైన రాజకీయం. ఆయన ఎపుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడకు వరస పర్యటనలు చేస్తారు.

By:  Satya P   |   21 April 2026 12:00 AM IST
మోడీ బెంగాల్ సీఎం గానా-మమత చూపు పీఎం సీటు పైనా !
X

ప్రధాని నరేంద్ర మోడీది ఒక విలక్షణమైన రాజకీయం. ఆయన ఎపుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడకు వరస పర్యటనలు చేస్తారు. ఆ రాష్ట్రం చుట్టూనే విమానాల్లో ఎక్కీ దిగుతూ బిజీ షెడ్యూల్స్ వేస్తారు. ఎన్నికల ప్రచార పర్వం ముగిసేవరకూ మోడీ ఆ రాష్ట్రాలను విడిచి వెళ్ళేది ఉండదు. ఇది గత 12 ఏళ్ళుగా దేశంలో అంతా చూస్తున్నదే. ఇక తమకు గట్టి పోటీ అనిపించే రాష్ట్రం విషయంలో అయితే మోడీ మరింతగా జోరు చూపిస్తారు. అదే పనిగా టూర్లు వేస్తారు. ఇంకా చెప్పాలంటే లోకల్ లీడర్ మాదిరిగా తన ప్రచారంలో ఎన్నో పదనిసలు కూడా చూపిస్తారు.

కిల్లీ బడ్డీ వద్ద మోడీ :

నరేంద్ర మోడీ తాజాగా బెంగాల్ పర్యటనలో ఒక కిల్లీ బడ్డీ వద్దకు చేరి పల్లీలు తింటూ గడిపారు. అంతే కాదు కిల్లీ బడ్డీ యజమానితో ముచ్చటించిన దృశ్యాలు కూడా వీడియో బైట్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడకు మోడీ కోసం చేరిన జనాలను ఉద్దేశించి పలకరిస్తూ మోడీ అచ్చమైన రాజకీయ ప్రచారమే చేశారు. అంటే తాను ఒక బెంగాలీగా స్థానికుడిగా ఆ రాష్ట్ర పౌరుడిగా మోడీ చెప్పుకునేందుకు ఈ ప్రచారం చేశారు అని ప్రత్యర్ధులు ఘాటుగా విమర్శించారు. అయినా సరే ఇది ఎన్నికల స్టంట్ అనుకున్నా సరే బీజేపీ కోసం మోడీ ఈ తరహా ప్రచారాలు చేస్తారు అని కూడా ప్రత్యర్ధులు సెటైర్లు వేస్తున్నారు.

ఖర్గే విసుర్లు :

మోడీ ఇంతకీ దేశానికి ప్రధానా లేక బెంగాల్ సీఎం కావాలని అనుకుంటున్నారా అని సాక్ష్యాత్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మోడీ మీద సెటైర్లు పేల్చారు. మోడీ ఎప్పుడు చూసినా బెంగాల్ లోనే కనిపిస్తున్నారు అని ఆయన అంటున్నారు. అధికారిక కార్యక్రమాలను కూడా పక్కన పెట్టి మరీ మోడీ బెంగాల్ లో చక్కర్లు కొడుతున్నారని కూడా విమర్శించారు. బెంగాల్ లో తమ పార్టీ గెలుపు కోసం మోడీ మరీ ఇంతలా ప్రచారం చేయడమేంటి అని కూడా ఆయన ఫైర్ అయ్యారు.

మమత ఫోకస్ అలా :

అయితే మోడీ దేశానికి ప్రధానిగా ఉంటూ కూడా బెంగాల్ లో పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో బెంగాల్ కి మూడు సార్లు సీఎం గా ఉన్న మమత నాలుగో సారి వరసగా గెలిస్తే కనుక ఈసారి జాతీయ రాజకీయాల వైపు చూస్తారు అని అంటునారు. ఆమె 2029 ఎన్నికల నాటికి ప్రధాని పదవికి పోటీ పడతారు అని అంటున్నారు. ఎప్పటి నుంచో జాతీయ రాజకీయాల్లోకి రావాలని మమత చూస్తూనే ఉన్నారు ఈసారి గెలిస్తే వేయి ఏనుగుల బలంతో ఆమె తన పార్టీతో నేరుగా బీజేపీని జాతీయ స్థాయిలో ఢిల్లీ వేదికగా ఢీ కొంటారని అంటున్నారు.

ప్రజల తీర్పు అయితే సిద్ధం :

మోడీ అయితే బెంగాల్ లో తానే ముఖ్యమంత్రి అభ్యర్ధి అన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉంటే మమత తాను దేశానికి కాబోయే ప్రధాని అన్న విధంగా పూర్తి ఆధిపత్య ధోరణిలో తన జోరుని దూకుడుని చూపిస్తున్నారు. మొత్తం మీద బెంగాల్ లో మొగ్గు మమత వైపు ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మోడీ కిల్లీ బడ్డీ వద్ద ఆగి ముచ్చట్లు పెట్టడం జనసామాన్యంలో కలసిపోవడం వంటి రాజకీయ విన్యాసాలు చేస్తున్నారు అని విపక్షాలు అంటున్నాయి. ఎవరెన్ని చేసినా బెంగాల్ లో బీజేపీ తరఫున అగ్ర నేతలు ఎన్ని సార్లు పర్యటించినా ప్రజల తీర్పు అయితే ఇప్పటికే సిద్ధం అయింది అని టీఎంసీ నేతలు అంటున్నారు.