Begin typing your search above and press return to search.

వివేకా కేసు: వైఎస్‌ షర్మిల వాంగ్మూలంపై లోకేశ్‌ ట్వీట్!

అయితే ఆ వాంగ్మూలంలో షర్మిళ ఇవే విషయాలు చెప్పారంటూ నారా లోకేశ్‌ స్పందించారు.

By:  Tupaki Desk   |   21 July 2023 1:07 PM GMT
వివేకా కేసు: వైఎస్‌  షర్మిల వాంగ్మూలంపై లోకేశ్‌  ట్వీట్!
X

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. అలాగే మరికొంత మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ సందర్భంగా లోకేష్ ట్వీట్టర్ లో స్పందించారు.

అవును... వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆ వాంగ్మూలంలో షర్మిళ ఇవే విషయాలు చెప్పారంటూ నారా లోకేశ్‌ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఇందులో... "మా బాబాయ్ ని చంపించింది అవినాషే కావొచ్చు" అని షర్మిళ అన్నట్లుగా పేర్కొన్నారు!

ఇంకా... "రాజకీయ కారణలతోనే హత్య.. హత్యకు పెద్ద కారణం ఉంది.. కడప ఎంపీగా పోటీ చేయమని బాబాయ్ నన్ను అడిగారు.. అవినాష్ కుటుంబానికి వ్యతిరేకంగా వివేకా నిలబడటమే హత్యకు కారణం.. కుటుంబంలో అంతా బాగున్నట్లు కనిపించినా.. లోపల కోల్డ్ వార్ ఉండేది" అని బుల్లెట్ పాయింట్స్ లా ఆ పోస్ట్ లో పెట్టారు లోకేష్.

కాగా... వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 259వ సాక్షిగా సీబీఐ ఎదుట హాజరైన షర్మిల వాగ్మూలంలో కీలక విషయాలు వెళ్లడించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... తన వద్ద ఆధారాల్లేవు కానీ రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగిందని ఆమె అన్నట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో... హత్యకు కుటుంబ, ఆర్థిక వ్యవహారాలు కారణాలు కాదni ఆమె వెళ్లడించారని అంటున్నారు. అదేవిధంగా... హత్యకు కొన్ని నెలల ముందు బెంగళూరులోని తమ ఇంటికి వివేకా వచ్చారని.. కడప ఎంపీగా పోటీ చేయాలని ఆయన తనను అడిగారని షర్మిళ చెప్పారని తెలుస్తుంది.

అనంతరం ఎంపీగా అవినాష్‌ పోటీ చేయొద్దని కోరుకుంటున్నట్లు చెప్పారని.. అతడికి టికెట్‌ ఇవ్వకుండా ఎలాగైనా జగన్‌ ను ఒప్పిద్దామని తనతో అన్నారని.. జగన్ ను కచ్చితంగా ఒప్పించగలననే ధీమాతో ఆయన మాట్లాడారని షర్మిళ చెప్పారని తెలుస్తుంది.

కాగా.. గతనెల 30న కీలక సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సీబీఐ అందజేసింది. వివేకా హత్య కేసులో సాక్షిగా వైఎస్ షర్మిలతో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్‌ ల వాంగ్మూలను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు!