Begin typing your search above and press return to search.

బాబు బయటకు వస్తే ఆ పార్టీలకే మొదటి దెబ్బ..?

చంద్రబాబు నెల రోజులకు పైగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. బాబు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేయడం లేదు.

By:  Tupaki Desk   |   15 Oct 2023 10:37 AM GMT
బాబు బయటకు వస్తే ఆ పార్టీలకే మొదటి దెబ్బ..?
X

చంద్రబాబు నెల రోజులకు పైగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. బాబు బెయిల్ కోసం న్యాయ పోరాటం చేయడం లేదు. క్వాష్ పిటిషన్ పేరుతో ఏకంగా కేసుని కొట్టేయించుకునేందుకు పోరాటం చేస్తున్నారు. దాంతో ఆయనకు ఎక్కడా రిలీఫ్ లభించడంలేదు. ఇదిలా ఉంటే ఈ నెల 17న సుప్రీం కోర్టులో బాబు కేసు విచారణ ఉంది. ఆ రోజు ఏమైనా తేలుతుందా అన్న చర్చ కూడా ఉంది.

ఒక వేళ క్వాష్ పిటిషన్ మీద అనుకూల తీర్పు వస్తే బాబు బయటకు దర్జాగా వస్తారు. తన మీద తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడుతూ జనంలోకి వెళ్తారు. క్వాష్ పిటిషన్ని సుప్రీం కోర్టు కొట్టేస్తే కనుక బాబు బెయిల్ పిటిషన్ పెట్టుకోవాల్సిందే. బెయిల్ ని సీఐడీ సహజంగా అడ్డుకుంటుంది కానీ హెల్త్ గ్రౌండ్స్, ఏజ్ రిత్యా బాబుకు బెయిల్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఇదంతా అయ్యేటప్పటికి తెలంగాణా ఎన్నికల వేడి పీక్స్ కి చేరుకుంటుంది అని అంటున్నారు. చంద్రబాబు బయటకు రాగానే తన ఫోకస్ మొత్తం తెలంగాణా ఎన్నికల మీదనే పెడతారు అని అంటున్నారు. అపుడు కచ్చితంగా అక్కడ రెండు ప్రధాన పార్టీలకు దెబ్బ పడే అవకాశం ఉంది అని కూడా అంచనా వేస్తున్నారు.

బాబుని తెలంగాణా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ ములాఖత్ ద్వారా కలిశారు. ఆయనతో ఏమి చర్చించారో కానీ తొందరలోనే తెలంగాణా ఎన్నికలకు సంబంధించి బాబు అభ్యర్ధులను రెడీ చేసి జ్ఞానేశ్వర్ కి అందిస్తారు అని అంటున్నారు. బాబు జైలులోనే అభ్యర్ధుల లిస్ట్ ని ప్రిపేర్ చేస్తున్నారు అని అంటున్నారు.

ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ సహా శివారు ప్రాంతాలలో అభ్యర్ధులను నిలబెట్టాలని టీడీపీ నిర్ణయించింది. దాంతో తొందరలోనే లిస్ట్ బయటకు రానుంది అని అంటున్నారు. ఇక బాబు బయటకు వస్తే చాలా రోజుల తరువాత ఆయనను చూడడం అవుతుంది, అలాగే జైలు నుంచి రావడం వల్ల ఒక రకమైన ఆసక్తి క్రేజ్ ఉంటాయి. దాన్ని తెలంగాణా ఎన్నికల మీద పెట్టి అక్కడ రాజకీయ ప్రయోజనాలను పొందేలా చూస్తారు అని అంటున్నారు.

తన పార్టీని తెలంగాణాలో చంద్రబాబు పెంచుకోవడానికే చూస్తారు అని అంటున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా తెలుగుదేశం ఏమైనా గ్రాఫ్ పెంచుకుంటే అది కచ్చితంగా బీయారెస్ బీజేపీలకు దెబ్బ అవుతుంది అని అంటున్నారు. ఎందుకంటే ఆంధ్రా సెటిలర్స్ ని బాబు టర్న్ చేసుకుంటే మాత్రం ఆ రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్న మేరకు ఓట్లు పడవని అంటున్నారు.

మరో వైపు బాబు అరెస్ట్ వెనక బీజేపీ ఉందని అంటున్న వారూ ఉన్నారు. అలాగే తెలంగాణా గడ్డ మీద బాబు అరెస్ట్ తరువాత నిరసనలు పెద్దగా చేయనీయకుండా అక్కడి ప్రభుత్వం కట్టడి చేసింది. స్వయంగా కేటీయార్ దీని మీద మాట్లాడుతూ ఏపీలో ఆందోళనలు చేసుకోవాలని కోరడం జరిగింది.

దాంతో ఆ ప్రభావం సెటిలర్స్ లో ఒక బలమైన వర్గం మీద పడే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్ల బాబు బయటకు వస్తే వైసీపీ కంటే ఆ రెండు పార్టీలకే ఎక్కువ ఇబ్బంది అని విశ్లేషిస్తున్నారు. ఇక చంద్రబాబు ఇప్పట్లో బయటకు వస్తారా అన్న డౌట్లూ మరో వైపు వినిపిస్తున్నాయి. దానికి జోతీష్యపరమైన అవరోధాలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు సరైన టైం లోనే బయటకు వస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తెలంగాణాలో కూడా టీడీపీ తన బలాన్ని పెంచుకుంటుందని అంటున్నారు.