Begin typing your search above and press return to search.

బాబు కోసం భవిష్యత్ తరం... నారా బ్రాహ్మణి రియాక్షన్!

ఈ క్రమంలో... వచ్చీరాని మాటలతో ఆ బాలుడు బ్రాహ్మణిని అబ్బురపరిచాడు. 2024లో చంద్రబాబు సీఎం అయ్యే వరకు తాను పోరాడతానని.

By:  Tupaki Desk   |   16 Sep 2023 5:48 AM GMT
బాబు కోసం భవిష్యత్  తరం... నారా బ్రాహ్మణి రియాక్షన్!
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రస్తుతం రిమాండ్‌ పై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి చంద్రబాబు కుటుంబం జైలు సమీపంలోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నాలుగున్నరేళ్ల బాలుడు అనిత్ తన తల్లిదండ్రులతో కలిసి పరామర్శకు వచ్చాడు. అనంతరం నారా బ్రాహ్మణిని కలిశాడు.

ఈ క్రమంలో... వచ్చీరాని మాటలతో ఆ బాలుడు బ్రాహ్మణిని అబ్బురపరిచాడు. 2024లో చంద్రబాబు సీఎం అయ్యే వరకు తాను పోరాడతానని.. యువగళం యాత్రలో లోకేష్ తన కాళ్లకు బొబ్పలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగారని చెప్పుకొచ్చాడు. ఆయనకు తన హృదయపూర్వక అభినందనలని చెప్పాడు. దీంతో ఈ బాలుడి మాటలకు బ్రాహ్మణి "సో నైస్‌.. థ్యాంక్యూ" అంటూ అభినందించారు.

ఈ విషయాలను ట్విట్టర్ లో పంచుకున్నారు బ్రాహ్మణి. చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యే వరకు పోరాడతానని అనిత్‌ చెప్పిన అనీత్... అనంతరం చిన్నసైజు స్పీచే ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బ్రాహ్మణి ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. "చంద్రబాబుకు మద్దతు ఇవ్వడానికి అనిత్‌ కుమార్‌ అనే బాలుడు చాలా శ్రమపడి వచ్చాడు" అని తెలిల్పారు.

ఇదే సమయంలో "బాలుడి తల్లిదండ్రులు "చంద్రన్న పెళ్లి కానుక" ద్వారా వివాహం చేసుకున్నారు" అని బ్రాహ్మణి ట్విట్టర్ లో తెలిపారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాలను రక్షించడానికి తాను కూడా చంద్రబాబు నాయుడుతో ఉన్నానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు... ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయనకు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ సమయంలో జైలుకు దగ్గరలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు వారిని పరామర్శిస్తున్నారు.