Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..!

ఆయన మంగళగిరిలో ప్రచారం చేసుకోవడం కాదు, ఏపీ అంతటా తిరగాలి దాంతో నారా లోకేష్ కి మద్దతుగా బ్రాహ్మణి మంగళగిరిలోకి అడుగుపెట్టారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Feb 2024 8:29 AM GMT
రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..!
X

నారా బ్రాహ్మణి రాజకీయాల్లో పెద్దగా కనిపించడానికి ఇష్టపడరు. ఆమె ఎంతసేపూ హెరిటేజ్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను చూసుకునేందుకే ఇష్టపడతారు. టీడీపీలో చంద్రబాబు అన్నీ తాను అయి ఉన్న వేళ ఆయనకు సాయంగా నారా లోకేష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

అలా తండ్రీ కొడుకులకే పరిమితం అయిన టీడీపీ రాజకీయం బాబు అరెస్ట్ తో కీలక మలుపు తిరిగింది. బాబు అరెస్ట్ అయి 52 రోజులు జైలులో ఉన్నారు. ఆ సమయంలో నారా బ్రాహ్మణి. జనంలోకి వచ్చారు. ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లో ఆనాడు కనిపించారు. అప్పట్లో కొవ్వొత్తుల ర్యాలీతో పాటు అనేక రకాలైన కార్యక్రమాలలో ఆమె పాల్గొన్నారు.

ఎపుడైతే బాబు జైలు నుంచి బయటకు వచ్చారో ఆమె తన వ్యాపార కార్యక్రమాలలో నిమగ్నం అయిపోయారు. అలాంటి బ్రాహ్మణి సడెన్ గా మంగళగిరి తెర మీద కనిపించారు. ఆమె ఎందుకు అక్కడికి వెళ్లారు అంటే 2024లో మరోసారి నారా లోకేష్ రెండవసారి ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు.

ఈసారి ఆరు నూరు అయినా గెలిచి తీరుతాను అని లోకేష్ అంటున్నారు. ఆయన మంగళగిరిలో ప్రచారం చేసుకోవడం కాదు, ఏపీ అంతటా తిరగాలి దాంతో నారా లోకేష్ కి మద్దతుగా బ్రాహ్మణి మంగళగిరిలోకి అడుగుపెట్టారు అని అంటున్నారు.

బ్రాహ్మణి తాజాగా మంగళగిరిలోని శ్రీ శక్తి కేంద్రంలోకి అడుగుపెట్టారు. అక్కడ మహిళా లబ్దిదారులతో ఆమె మాటా మంతీ నిర్వహించారు. మహిళలు స్వయం ఉపాధి పొందే విధంగా చేసింది స్త్రీ శక్తి కేంద్రం రూపొందించారు. ఈ సందర్భంగా తన భరత మాజీ మంత్రి లోకేష్ పేద మహిళల కోసమే నిరంతరం పాటు పడుతూ ఉంటారని చెప్పుకొచ్చారు.

మహిళలు సొంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలన్నది లోకేష్ ఆలోచనగా ఆమె చెప్పడం విశేషం. మంగళగిరిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని అజెండా లోకేష్ పెట్టుకున్నారని 27 పధకాలకు రూపకల్పన చేస్తున్నారు అని బ్రాహ్మణి వివరించడం విశేషం. రాబోయే రెండు నెలల తరువాత మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని కూడా ఆమె హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే 2019లో కూడా లోకేష్ కోసం బ్రాహ్మణి విస్తృతంగా తిరిగి ప్రచారం చేశారు. ఈసారి కూడా ఆమె పెద్ద ఎత్తున మంగళగిరిలో ప్రచారం చేస్తారు అని అంటున్నారు. అయితే బ్రాహ్మణి ప్రచారం కేవలం మంగళగిరికే పరిమితం అవుతుందా లేక ఏపీ అంతా సాగుతుందా అన్నది చూడాల్సి ఉంది.

ఎందుకంటే టీడీపీకి ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈసారి కనుక ఓడిపోతే టీడీపీ దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవడం ఖాయం. అందుకే ఇప్పటికే నారా భువనేశ్వరి జనంలో ఉంటున్నారు. ఆమె అనేక చోట్ల తిరుగుతున్నారు. మరో వైపు చంద్రబాబు లోకేష్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు ఇపుడు నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో అడుగుపెట్టారు.

రానున్న రోజులలో ఆమె రాజకీయం ఏ మలుపు తీసుకుంటుంది అన్నది ఆసక్తిగా ఉంది. ఆమె తండ్రి సినీ నటుడు బాలయ్య కూడా హిందూపురం నుంచి మూడవసారి పోటీ చేయబోతున్నారు. అలాగే ఏపీలో కీలకమైన నియోజకవర్గాలలో బ్రాహ్మణి టూర్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి మొత్తం నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కూడా ఈసారి ఎన్నికల కోసం జనంలోకి వస్తారు అని అంటున్నారు.