Begin typing your search above and press return to search.

‘వీరమల్లు’ అన్నకి లోకేష్ స్పెషల్ విషెస్... ప్రీమియర్ కలిసి చూడబోతున్నారా?

ఈ క్రమంలో... మరికొన్ని గంటల్లో ‘వీరమల్లు వీరతాండవం’ చేయబోతున్న వేళ లోకేష్ స్పందించారు.

By:  Tupaki Desk   |   23 July 2025 1:58 PM IST
‘వీరమల్లు’ అన్నకి లోకేష్ స్పెషల్  విషెస్... ప్రీమియర్ కలిసి చూడబోతున్నారా?
X

పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా జులై 24 గురువారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నేడు అర్ధరాత్రి నుంచి పలు స్పెషల్ షోలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు! ఈ సమయంలో లోకేష్ స్పందించారు.

అవును... పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' జోరు మీదున్నట్లే కనిపిస్తుంది. ఈ సందర్భంగా.. గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టేలా ఉందనే టాక్ ఇండస్ట్రీలో మొదలైందని అంటున్నారు. మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించిన దానికి మించి ఉండేలా అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో... మరికొన్ని గంటల్లో ‘వీరమల్లు వీరతాండవం’ చేయబోతున్న వేళ లోకేష్ స్పందించారు.

ఈ సందర్భంగా... ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మా పవన్ అన్న సినిమా విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు అని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా... పవర్ స్టార్ అభిమానుల్లాగే తానూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ తనకు చాలా చాలా ఇష్టం అని అన్నారు.

ఈ నేపథ్యంలోనే వీరమల్లుకి లోకేష్ విషెస్ చెప్పారు. ఇందులో భాగంగా... పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌ తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు. దీంతో... ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారుతోంది! ఈ సందర్భంగా... నారా లోకేష్ కు జనసైనికులు, పవన్ అభిమానులు కృతజ్ఞలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు... నేడు హరిహర వీరమల్లు స్పెషల్ ప్రీమియర్ షో ని పవర్ స్టార్ తో కలిసి నారా లోకేష్ చూడబోతున్నట్టు తెలుస్తోంది. ఆ విధంగా... ఈ సినిమాకు లోకేష్ తొలి ప్రేక్షకుడు కాబోతున్నారనీ అంటున్నారు.