దటీజ్ లోకేష్...కొద్ది గంటలలోనే చేంజ్ !
నారా లోకేష్ విద్యా శాఖా మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రి అయ్యాక ఆ శాఖ మీద తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
By: Tupaki Desk | 10 Jun 2025 9:15 AM ISTనారా లోకేష్ విద్యా శాఖా మంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రి అయ్యాక ఆ శాఖ మీద తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని ఆగ్రహించి గతంలో చలో విజయవాడ వంటి ఆందోళనలకు దిగిన ఉపాధ్యాయులు తరువాత కాలంలో సీపీఎస్ రద్దు వంటి అనే అంశాలతో పాటు తమ చిరకాల డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు.
చివరికి వారంతా వైసీపీని కాదని కూటమి గెలుపు కోసం తమ వంతుగా తపన పడ్డారు. ఇక వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ఫేషియల్ రికగ్నేషన్ ని రద్దు చేయాలని వారి డిమాండ్ ని కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసి ఆనదింప్చేసింది. అలాగే ఒకటవ తేదీకి ఠంచనుగా జీతాలు వస్తున్నాయి.
టీచర్లకు ప్రోత్సాహంగా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకుంటోనిద్. అయితే బదిలీల విషయంలో మాత్రం ఒక పేచీ వచ్చింది. ఆన్ లైన్ లో బదిలీ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచించింది. మీ మేరకు నిర్ణయం తీసుకుంది. దీని మీద వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు.
ఇక ఉత్తరాంధ్రా పర్యటనకు వచ్చిన లోకేష్ ఇదే విషయం మీద పార్వతీపురంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ చట్ట ప్రకారం మాన్యువల్ విధానం తప్పు కాబట్టి ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు.అయితే ఉదయం ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. సాయంత్రం అయ్యేసరికి మార్చుకున్నారు. అంతే కాదు రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్స్ బదిలీల ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టారు. ఈ బదిలీల కోసం ఇప్పటివరకు అనుసరిస్తున్న ఆన్‌లైన్ కౌన్సెలింగ్ విధానానికి బదులుగా మాన్యువల్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహించాలని నారా లోకేశ్ నిర్ణయించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ఆన్ లైన్ విధానంలో లోపాలు ఉన్నాయని టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు ఇతర పార్టీల నేతలు లోకేష్ కి వివరించడంతో ఆయన వెంటనే తన డెసిషన్ ని చేంజ్ చేసుకున్నారు. అంతే ఆన్‌లైన్ విధానంలోని లోపాలను వివరిస్తూ ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాన్యువల్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలని వారు కోరారు. దానికి ఆయన వెనువెంటనే సమ్మతించారు.
దీంతో టీచర్లు అంతా హర్షం వ్యక్తం చేస్తునారు. నిజానికి ఈ ఇష్యూ మీద మెల్లగా ఆందోళన పధంలోకి వచ్చిన టీచర్లు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధపడుతున్నారు. కానీ మంత్రి లోకేష్ చొరవ తీసుకుని ఇష్యూ ముదరకుండా ఫుల్ స్టాప్ పెట్టడంతో అంతా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు
లోకేష్ తనదైన రాజనీతిని చూపించారు అని భేషజాలకు పోకుండా వ్యవహారాన్ని సెటిల్ చేశారని అంతా అంటున్నారు. పైగా టీచర్ల మద్దతు మరోసారి కూటమికే ఉండేలా చూసుకున్నారని అంటున్నారు. నాయకులు అయినా ఏలికలు అయినా ఒక డెసిషన్ తీసుకుంటే దానికే కట్టుబడిపోకూడదు. లోపాలు ఉంటే కచ్చితంగా సవరించుకోవాలి. లోకేష్ ఆ విధంగా చేయడం ద్వారా దటీజ్ లీడర్ అనిపించుకున్నారని చెబుతున్నారు.
