Begin typing your search above and press return to search.

అలిగి ప‌డుకోవ‌డం.. క‌రోనా క‌న్నా ప్ర‌మాదం: లోకేష్‌

టీడీపీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఆ పార్టీ నేష‌న‌ల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ కీల‌క సూచ‌న‌లు చేశారు.

By:  Garuda Media   |   24 Jun 2026 9:00 PM IST
అలిగి ప‌డుకోవ‌డం.. క‌రోనా క‌న్నా ప్ర‌మాదం:  లోకేష్‌
X

టీడీపీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఆ పార్టీ నేష‌న‌ల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌.. నారా లోకేష్ కీల‌క సూచ‌న‌లు చేశారు. పార్టీలో ఉన్న చిన్న‌పాటి విభేదాల‌ను పెద్ద‌వి చేసుకోవ‌ద్ద‌న్నారు. ముఖ్యంగా కూట‌మితో క‌లివిడిగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని తెలిపారు. పార్టీ కంటే కూడా ఏదీ ముఖ్యం కాద‌న్నారు. పార్టీలో ఉన్న వారు ప్ర‌తి స‌మ‌స్య‌ను త‌మ‌దిగా భావించాల‌ని.. పెద్ద‌ది చేయొద్ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ క‌లివిడిగా ఉన్న‌ప్పుడే.. పార్టీకి , ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని అవ‌నిగ‌డ్డ‌లో ప‌ర్య‌టించిన లోకేష్‌.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో బేటీ అయ్యా రు. అవ‌నిగ‌డ్డ టీడీపీకి కంచుకోట అని తెలిపారు. అయితే.. కొంద‌రు నాయ‌కులు చిన్న చిన్న కార‌ణాల‌తో అలిగి ఇంట్లో ప‌డుకుంటున్నార‌ని.. కానీ, ఇలా చేయ‌డం క‌రోనా కంటే కూడా అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. దీనిని త‌క్ష‌ణ‌మే వ‌దిలి వేయాల‌ని సూచించారు.

గొడ్డ‌లి పార్టీ నేత‌లు, గ‌త ప్ర‌భుత్వంలో బూతు మంత్రులు కృష్ణా జిల్లా ప‌రువు ఎలా తీశారో, ప్ర‌స్తుతం విష‌ప్ర‌చారాలు ఎలా చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన బాధ్య‌త కేడ‌ర్‌పై ఉంద‌ని లోకేష్ అన్నారు. ``గత ప్రభుత్వంలో బూతుల మంత్రి ఉండేవారు, ఒకడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవాడు. మరొకడు భువనేశ్వరమ్మను అవమానించేవాడు. నేను ఆనాడే చెప్పా, వారి పేర్లు ఎర్రబుక్కులో రాస్తున్నా అని. వారి విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు, రెడ్ బుక్ తన పని తాను చేస్తుంది.`` అని పేర్కొన్నారు.

మార్పు మొద‌లైంది..

కడపలో గతఏడాది మహానాడులో ఐడియాలజీలో మార్పుకోసం ఆరుశాసనాలు తీసుకున్నామ‌ని లోకేష్ చెప్పారు. దీనిలో తొలి శాసనం కార్యకర్తే అధినేత అని.. మార్పు మొద‌లైంద‌ని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ శాశ్వతమ‌ని, వ్యవస్థను బలోపేతం చేసేందుకు అందరం అహర్నిశలు కష్టపడాలని ఆయ‌న పిలుపునిచ్చారు. గత అరాచక పాలనలో చంద్రబాబును సైతం జైలుకు పంపారని తెలిపారు.

``ప్రతిపక్షంలో ఉన్నపుడు పోరాడతాం, యుద్ధం చేస్తాం. అధికారంలోకి వచ్చాక రిలాక్స్ అయిపోతాం. కష్టకాలాన్ని మర్చిపోకూడదు. చిన్నపాటి పొరపాటు జరిగినా అలిగి ఇంట్లో పడుకుంటున్నారు. ఇది క‌రోనా కన్నా ప్రమాదకరమైన జబ్బు`` అని వ్యాఖ్యానించారు.