'ఆత్మీయ విందు' వెనుక అసలు ఫార్ములా ఇదే.. !
మంత్రి నారా లోకేష్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందుకు శ్రీకారం చుట్టారు.
By: Garuda Media | 15 Feb 2026 2:00 PM ISTమంత్రి నారా లోకేష్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ విందుకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే రోజూ ఒక పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అవుతున్నారు. ఇప్పటి వరకు మచిలీ పట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలతోను, వారి కుటుంబాలతోనూ ఆయన భేటీ అయ్యారు. వారితో కలిసి విందు చేశారు.
అయితే.. ఈ ఆత్మీయ విందుల వెనుక కేవలం కలిసి భోజనం చేయడం.. కబుర్లు చెప్పుకోవడమనే కాన్సెప్టు కాదు.. అత్యంత కీలకమైన ఫార్ములా వేరేగా ఉంది. కుటుంబాలకు కూడా పార్టీ తరఫున భరోసా కల్పించాల న్నదే ప్రధాన వ్యూహం. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ ఈ తరహా కార్యక్రమం చేయలేదు. చివర కు టీడీపీలోనూ ఎమ్మెల్యేల కుటుంబాలను ఒక వేదికపై చేర్చి నిర్వహించిన కార్యక్రమం లేదు. కానీ, తొలి సారి ఇలాంటి ఆలోచన చేశారు. దీని వెనుక ప్రధానంగా రెండు రీజన్లు ఉన్నాయి.
1) నారా లోకేష్ అందరికీ పరిచయం కావడం: ఇప్పటి వరకు టీడీపీ తరఫున చంద్రబాబు అంరదికీ సుపరిచితమే. నారా లోకేష్ కూడా అంతే. అయితే.. దీనికి భిన్నంగా మరింత ఆత్మీయంగా టీడీపీ నేతలు, వారి కుటుంబాలతో మేమేకం కావడం ద్వారా నారా లోకేష్‌ను పెద్దగా భావించే అవకాశం ఉంటుంది. ఇదేసమయంలో తమకు కీలక నాయకుడు పరిచయం అయ్యాడన్న సంతృప్తి కూడా ఆయా నేతల కుటుంబాల్లో ఉంటుంది. ఇది ఎన్నికల సమయానికి లోకేష్‌ను మరింత బలోపేతం చేస్తుంది.
2) అందుబాటులో ఉంటున్నామన్న భావన: తాను అందరికీ సులభంగా అందుబాటులో ఉంటున్నానన్న భావనను లోకేష్ కల్పించడం కూడా ఈ విందు సమావేశాలకు కీలకంగా మారింది. ముఖ్యమంత్రితో లేదా మంత్రులతో అపాయింట్‌మెంట్ దొరకడమే కష్టమైంది. ఇలాంటి సమయంలో లోకేష్ స్వయంగా ఎమ్మెల్యేల కుటుంబాలకు తన ఇంటి తలుపులు తీయడం ద్వారా వారిలో ప్రత్యేక మైన భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో ఉన్న అనుబంధం వల్ల, భవిష్యత్తులో రాజకీయంగా ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా ఆత్మీయతతో కూడిన ఐక్యత ఆ నాయకులను పార్టీతోనే ఉండేలా చేస్తుంది. ఇలా.. రెండు కీలక లక్ష్యాలతో నారా లోకేష్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పరిశీలకులు చెబుతున్నారు.
