కాబోయే సీఎం మీరేనట...లోకేష్ షాకింగ్ ఆన్సర్!
అయితే నిజానికి ఇది టఫ్ క్వశ్చన్ గానే చూడాలి. ఒక వైపు మహానాడు అవుతోంది. లీడర్స్ నుంచి క్యాడర్ వరకూ అంతా లోకేష్ జపం చేస్తున్నారు.
By: Tupaki Desk | 28 May 2025 12:20 AM ISTనారా లోకేష్ మయంగా కడపలో టీడీపీలో మహానాడు జరుగుతోంది. అందరూ కలసి లోకేష్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్ధం అయింది. టీడీపీ లోకేష్ చేతిలోకి వెళ్ళబోతోంది అని. దాంతో అంతా లోకేష్ ని ప్రసన్నం చేసుకోవడం మొదలెట్టారు.
తమ ప్రసంగాలలో ఆయనే భవిష్యత్తు నాయకుడు అంటున్నారు. అయితే ఎవరూ కాబోయే సీఎం అని అతి ఉత్సాహానికి పోవడం లేదు ఎందుకు అంటే గత అనుభవాలు చాలా ఉన్నాయి. దాంతో ఆ పదవి ఊసు లేకుండా నర్మగర్భంగా లోకేష్ నే లీడ్ చేస్తారు ఆయనే ఏపీకి ఆశా కిరణం అంటూ చాలా విధాలుగా మాట్లాడుతున్నారు.
అయితే మీడియాకు ఆ భయాలు ఇబ్బందులు లేవు కదా. అందుకే మీడియాతో లోకేష్ చిట్ చాట్ చేసినపుడు ఇదే ఆసక్తిని ప్రశ్న రూపంలో బయటపెట్టేసింది. మీరేనట కాబోయే సీఎం ఆ శుభవార్త ఎపుడు అంటూ లోకేష్ నే గుచ్చి మరీ అడిగేసింది.
అయితే నిజానికి ఇది టఫ్ క్వశ్చన్ గానే చూడాలి. ఒక వైపు మహానాడు అవుతోంది. లీడర్స్ నుంచి క్యాడర్ వరకూ అంతా లోకేష్ జపం చేస్తున్నారు. లోకేష్ తోనే అంతా అంటున్నారు. వారిలో జోష్ తగ్గకూడదు, అలాగని జవాబుతో వేరే రకమైన ఇబ్బందులు రాకూడదు. అందుకే లోకేష్ చాలా తెలివిగా ఆన్సర్ చేశారు.
సీఎం పదవికి తొందరేముంది అని లైట్ తీసుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో చంద్రబాబు ఇంకా యువకుడే అని కితాబు ఇచ్చారు. ఆయన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ఏపీలో చంద్రబాబు ఉంటే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని అన్నారు.
వారి నాయకత్వం దేశానికి చాలా అవసరం అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక పదవులతో సంబంధం లేకుండా కూడా ప్రజా సేవ చేయవచ్చు అని తనకు ఉన్న మంత్రి పదవితోనే చేయవచ్చు అన్నట్లుగా లోకేష్ చాలా గడుసుగా బదులిచ్చారు. పార్టీని నమ్ముకున్న క్యాడర్ కి పనిచేయాలి. అలాగే ప్రజలకు కూడా ఎంతో చేయాలి. వీటి మీదనే తాము దృష్టి పెట్టామని లోకేష్ బదులిచ్చారు.
అయితే లోకేష్ జవాబులోనే చర్చ మరింతగా పెరిగే చాన్స్ ఉంది. సీఎం పదవికి తొందరేముంది అని ఆయన అన్నారు కానీ కాదు అని అనలేదు అపుడూ ఇపుడూ అని అనలేదు . అలాగే పవన్ కళ్యాణ్ అన్నట్లుగా కేంద్రంలో మోడీ ఏపీలో బాబు ఉండాలని అన్నారు. అదే సమయంలో ఏకంగా పదిహేనేళ్ళ పాటు బాబే సీఎం అని అనలేదు. అలా లోకేష్ తన జవాబుతో ఎవరికి తోచిన తీరున వారు ఆలోచించుకునే విధంగానే చెప్పారని అంటున్నారు. సో లోకేష్ జవాబు విన్న టీడీపీ వర్గాలు ఫుల్ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు అని అంటున్నారు.
