Begin typing your search above and press return to search.

పక్కా మాస్ అంటున్న లోకేష్ !

లోకేష్ ఏ క్షణాన మనసులో అనుకుని రెడ్ బుక్ రాయడం మొదలెట్టారో కానీ అది ప్రత్యర్ధుల పాలిట చిత్రగుప్తుని డైరీగా మారిపోయింది.

By:  Tupaki Desk   |   16 May 2025 9:26 AM IST
పక్కా మాస్ అంటున్న లోకేష్ !
X

నారా లోకేష్ రాముడు మంచి బాలుడు అన్నంత బుద్ధి మంతుడు. చక్కగా ఉన్నత విద్యను ఆయన విదేశాలలో చదువుకున్నారు క్లాస్ లీడర్ గానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సాఫ్ట్ స్కిల్స్ వైపు టీడీపీని నడిపిస్తూ కొత్త రూపు ఇచ్చారు. అలా లోకేష్ ని చూసిన వారు పప్పు అన్నారు. ఆయన పాలిటిక్స్ లో జోరు చూపించలేరు అని కూడా అన్నారు.

అయితే ఇంతింతై వటుడింతే అన్న తీరున లోకేష్ తనలోని మార్క్ ని చూపించారు. 2019 నుంచి 2024 మధ్య మాత్రం లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. వైసీపీ వేధింపులకు ఆయన తనదైన రీతిలో జవాబు చెబుతూ దూసుకుపోయిన వైనమే ఆయనని మాస్ లీడర్ గా మార్చింది. ఇక లోకేష్ భారీ పాదయాత్ర సైతం ఆయనను ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దింది.

లోకేష్ ఏ క్షణాన మనసులో అనుకుని రెడ్ బుక్ రాయడం మొదలెట్టారో కానీ అది ప్రత్యర్ధుల పాలిట చిత్రగుప్తుని డైరీగా మారిపోయింది. ఈ రోజున అంతా రెడ్ బుక్ అని కలవరిస్తున్నారు. లోకేష్ ఆనాడు తలచి అయినా ఉండరు రెడ్ బుక్ ఇంతలా పాపులర్ అవుతుందని. అందుకే ఆయన అంటున్నారు. నన్ను అనవసరంగా కెలకద్దూ అని.

తాను సాధారణంగా ఎవరి జోలికీ వెళ్ళను అని అనవసరంగా గొడవలు పెట్టుకోను అని. అయితే తన పార్టీ జోలికి తన క్యాడర్ జోలికి వస్తే మాత్రం వారికి తానేంటో చూపించాల్సి వస్తుందని పక్కా మాస్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు తరచూ 'రెడ్ బుక్' గురించి ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తూ, తమ కార్యకర్తలను వేధించిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లా పర్యటనలో లోకేష్ పార్టీ క్యాడర్ కి తానే వెన్నూ దన్నూ అన్నారు. వారికి ఏ కష్టం వచ్చినా సహించేది లేదు అన్నారు. రెడ్ బుక్ అన్నది మొదలెట్టిందే వారి కోసమని చెప్పారు. తమ పార్టీ క్యాడర్ విషయంలో ఎవరైనా తప్పు చేస్తే రెడ్ బుక్ కి భయపడాల్సిందే అని కూడా క్లారిటీ ఇచ్చేఅరు.

తాను పైకి సాఫ్ట్ కానీ ప్రత్యర్ధులకు మాస్ అవతార్ అని లోకేష్ తనలోని రెండవ కోణాన్ని ఆ విధంగా ప్రత్యర్ధులకు చూపించారు. ఇక పార్టీ క్యాడర్ అంతా ఒకే వర్గమని అది తెలుగుదేశం వర్గమని లోకేష్ చెప్పారు. అలకలు వద్దు, కలతలు వద్దు అని హితబోధ చేశారు. అంతా ఒక కుటుంబంగా ఉండాలని అన్నారు.

తొందరలోనే పార్టీ వారి కోసం మై టీడీపీ అని ఒక కొత్త యాప్ ని క్రియేట్ చేస్తామని లోకేష్ ప్రకటించారు. మహానాడు తరువాత ఆ యాప్ ని రిలీజ్ చేస్తామని ఆయన చెప్పారు. బూత్, క్లస్టర్ స్థాయిలోని కార్యకర్తలందరికీ ఈ యాప్ ద్వారానే కార్యక్రమాల సమాచారం సందేశాలు పంపిస్తామని నారా లోకేష్ వివరించారు. మొత్తానికి లోకేష్ పార్టీ క్యాడర్ కోసం ఎందాకైనా అని అంటున్నారు. ఒకనాడు చంద్రబాబు క్యాడర్ కి లీడర్ గా ఉంటే ఇపుడు ఈ తరంలో లోకేష్ వారి కోసం నిలిచారు అని అంటున్నారు. మొత్తానికి లోకేష్ టీడీపీని కొత్త పంధాలో నడిపిస్తూ ముందుకు సాగుతున్నారు అనే చెప్పాలి.