Begin typing your search above and press return to search.

'అర్ధమైందా రాజా?'... రెడ్ బుక్ తో లోకేష్ మాస్ స్పీచ్ పీక్స్!

అవును... మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.

By:  Tupaki Desk   |   29 May 2025 6:20 PM IST
అర్ధమైందా రాజా?...  రెడ్  బుక్  తో లోకేష్  మాస్  స్పీచ్  పీక్స్!
X

ఏపీ రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ రెడ్ బుక్ అనేది ఫుల్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత.. ఈ అంశం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో.. కడపలో జరుగుతున్న మహానాడు వేదికపై మరోసారి రెడ్ బుక్ పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా.. తిరుమల తొలి గడప.. దేవుని కడప. దేవుని కడప.. ఒంటిమిట్ట, అమీన్ పీర్ దర్గా ఉన్న పుణ్యభూమి. ఈ పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోంది అంటూ మహానాడు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా... 2024లో 94 శాతం స్ట్రైక్ రేట్ తో మాస్ విక్టరీని చూసి, చరిత్రను తిరగరాశామని చెప్పిన లోకేష్.. ఇది టీడీపీ కార్యకర్తల నాటు దెబ్బ అని అన్నారు. మన జెండా పీకేస్తామని, పార్టీ లేకుండా చేస్తామని చెప్పినవారే అడ్రస్ లేకుండా పోయారని.. వైనాట్ 175 అన్నవారికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు.

ఏ తప్పూ చేయని చంద్రబాబును జైల్లో పెడితే.. జగన్ ను ప్రజలే తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టి లాక్ చేశారని అన్నారు. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరని.. ట్రెండ్ సెట్ చేస్తారని.. అది సినిమా స్క్రీన్ అయినా, పొలిటికల్ స్క్రీన్ అయినా.. ఆయన ఒక లెజెండ్ అంటూ.. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని.. అది ఒక ప్రభంజనం అని లోకేష్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే.. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్లపై యాక్షన్ తీసుకుంటానని తాను గతంలో చెప్పానని గుర్తు చేసిన లోకేష్.. నేడు ఎర్ర బుక్ కాదు కదా ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది అని అన్నారు. ఈ సందర్భంగా పేర్లు చెప్పకుండానే కొన్ని కామెంట్లు చేశారు లొకేష్!

ఇందులో భాగంగా... "ఎర్ర బుక్ అంటేనే ఒకడికి గుండె పోటు వచ్చింది.. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్ రూమ్ లో కాలు జారి చేయి విరగ్గొట్టుకున్నాడు.. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికీ తెలుసు.. అర్ధమైందా రాజా.. అర్ధమైందా రాజా..?" అంటూ లోకేష్ తనదైన శైలిలో మహానాడు వేదికగా మాస్ స్పీచ్ ఇచ్చారు!