జగన్ కి లోకేష్ ఓపెన్ చాలెంజ్
నిన్న కడప మహానాడులో నేడు ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఓపెన్ చాలెంజ్ చేశారు.
By: Tupaki Desk | 2 Jun 2025 11:55 PM ISTనిన్న కడప మహానాడులో నేడు ట్విట్టర్ వేదికగా మంత్రి నారా లోకేష్ ఓపెన్ చాలెంజ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ గారికి ఓపెన్ చాలెంజ్ అని మొదలెట్టిన లోకేష్ ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే కట్టబెట్టారు అని మీరు తీవ్ర ఆరోపణలు చేశారు. అవి తప్పు అని నేను నిరూపిస్తాను లేకపోతే నా పదవికి రాజీనామా చేస్తాను అని లోకేష్ స్పష్టం చేశారు.
మీరు చేసిన ఆరోపణలు తప్పు అని తేలితే యువతకు బహిరంగ క్షమాపణలు చెప్పండి అని కోరారు విశాఖపట్నంలో ఐటీ పార్క్ హిల్ 3లో ఎకరం కోటి రూపాయలు వంతున మూడు ఎకరాల భూమిని కేటాయించామని లోకేష్ చెప్పారు. అలాగే కాపులుప్పాడ దగ్గర ఎకరం యాభై లక్షలు వంతున 56.36 ఎకరాలు కేటాయించామని చెప్పారు.
విషయం ఇలా ఉంటే జగన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని లోకేష్ ఫైర్ అయ్యారు. అనవసరంగా బురద జల్లి ప్యాలెస్ లో దాక్కోవడం కాదని నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. నా ఓపెన్ చాలెంజ్ కి సిద్ధమా జగన్ గారూ అని లోకేష్ ట్విట్టర్ నుంచే రెట్టించారు.
మీ అయిదేళ్ల పాలన ఒక విద్వంసం అని ఒక్క పరిశ్రమను కూడా ఏపీకి మీరు తీసుకుని రాలేకపోయారు అని లోకేష్ విమర్శించారు. అంతే కాదు ఉన్న పరిశ్రమలను కూడా ఏపీ నుంచి తరిమేశారు అన్నారు. ఏపీలో 2024లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిందని ఇరవై లక్షల ఉద్యోగాలే యువతకు కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన గుర్తు చేశారు.
ఏపీకి గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబడుతున్నామని ఆయన చెప్పారు. ఏపీకి ఈ రోజు వరసబెట్టి కంపెనీలు వస్తున్నాయని వాటిని చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు అని జగన్ ని ఉద్దేశించి విమర్శించారు. ఇబ్బంది అయితే ఈనో వాడండి కాస్తా రిలీఫ్ వస్తుది అని లోకేష్ సెటైర్లు వేశారు.
మొత్తం మీద మరోసారి జగన్ ని ఉద్దేశించి లోకేష్ ఓపెన్ చాలెంజ్ చేయడం చర్చనీయాంశం అయింది. పైగా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని లోకేష్ డేరింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మరి ఉర్సా కంపెనీకి ఒక రూపాయికి ఎకరం భూమి ఇచ్చారా లేదా అన్నది నిరూపించాల్సిన బాధ్యత అయితే వైసీపీ మీదనే ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో జగన్ మీద డైరెక్ట్ కామెంట్స్ చేయడం ద్వారా ఆయన్ని ముగ్గులోకి లోకేష్ లాగారు మరి దీనికి వైసీపీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
