Begin typing your search above and press return to search.

పవన్ జీవితాంతం పెద్దన్నే...లోకేష్ భావోద్వేగం

అమరావతిని ఒక నగరంగా నిర్మించడం లేదని అది దేశానికే గర్వకారణంగా రూపుదిద్దుకుంటోందని ఆయన చెప్పారు. ఒకే రాష్ట్ర ఒకే రాజధాని అన్నది తమ విధానం అన్నారు.

By:  Satya P   |   28 Feb 2026 9:10 AM IST
పవన్ జీవితాంతం పెద్దన్నే...లోకేష్ భావోద్వేగం
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు జీవితాంతం పెద్దన్నగా ఉంటారని అందులో అనుమానం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తమ బంధం గొప్పదని అన్నారు. అది కొనసాగి తీరుతుందని అన్నింటికీ అతీతంగా ఉంటుందని ఆయన అంటున్నారు. ముంబైలోని ముంబైలో ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఐడియాస్ ఆఫ్ ఇండియా - 2026 సదస్సులో ఆయన పాల్గొని అనేక అంశాల మీద మాట్లాడారు, అందులో భాగంగా పవన్ గురించి ప్రస్తావన వచ్చినపుడు లోకేష్ భావోద్వేగపూరిత మైన సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు ఈ గ్రేట్ :

చంద్రబాబు వయసు పాతికేళ్ళే అని లోకేష్ చెప్పడం విశేషం. ఆయన 75 ఏళ్ల వారుగా ఉన్నా ఆయన ఉత్సాహం ఆయన పడుతున్న కష్టం ఆయన ఆలోచనన వేగం ఆయన లక్ష్యాలు వినూత్నమైన విధానాలు అన్నీ చూస్తే కనుక ఆయన పక్కా యువకుడి కిందనే లెక్క అన్నారు. ఆయనతో పరుగులు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదని అన్నారు బాబు ఇచ్చే టాస్కులను తాము సాధించడమే పెద్ద టాస్క్ అని లోకేష్ చమత్కరించారు. ఆయన విజన్ ఎవరికీ అందదని ఆయన ఎపుడూ కొత్తదనం కోసమే చూస్తూంటారు అని లోకేష్ బాబు గురించి చెప్పుకొచ్చారు.

నగరం కాదు :

అమరావతిని ఒక నగరంగా నిర్మించడం లేదని అది దేశానికే గర్వకారణంగా రూపుదిద్దుకుంటోందని ఆయన చెప్పారు. ఒకే రాష్ట్ర ఒకే రాజధాని అన్నది తమ విధానం అన్నారు. అలాగే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది తమ అభిమతంగా చెప్పారు. అదే సమయంలో విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను ఆర్థిక రీజియన్లుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు ప్రగతిపధంలో సాగాలి అన్నది కూటమి పాలసీగా లోకేష్ చెప్పారు.

నమోతోనే ఏపీ ప్రగతి :

ఏపీ అన్ని విధాలుగా ఇపుడు అభివృద్ధి సాధిస్తోంది అని లోకేష్ అన్నారు. దానికి నాయుడు మోడీ కాంబినేషన్ నమో కారణం అని లోకేష్ కొత్త నిర్వచనం ఇచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండడం డబుల్ ఇంజన్ సర్కార్ తోనే ఏపీ ముందుకు సాగుతోంది అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల కూడా ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని లోకేష్ చెప్పారు. చంద్రబాబుని ఆయన విజన్ ని చూసి ఏపీకి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున వస్తున్నారు అని లోకేష్ వివరించారు.

ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తున్నాం :

ఏపీలో ఏ పరిశ్రమ వచ్చినా అనుబంధ పరిశ్రమలను కూడా అనుసంధానం చేస్తూ ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేస్తున్నామని లోకేష్ చెప్పారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఫాక్స్‌కాన్ లాంటి ఒక కంపెనీని తీసుకురావడమే కాకుండా దానికి అనుగుణంగా ఐఫోన్ అసెంబుల్‌కు అవసరమైన అన్ని విడిభాగాల తయారీదారులను ఒకే చోటకు తీసుకురావడమే ప్రభుత్వం పారిశ్రామిక విధానం అని అన్నారు. ఎకోసిస్టమ్ డెవలప్ చేస్తే కనుక పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వృద్ధి అవుతాయని ఆయన అన్నారు. భూమిని తక్కువ ధరకు ఇస్తున్నామన్నది కాదని ఆయా పరిశ్రమల వల్ల వచ్చే ఉపాధిని అభివృద్ధిని చూడాలని ఆయన కోరుతున్నారు. ఉదాహరణకు కాగ్నిజెంట్ కంపెనీన విశాఖలో రావడం వల్ల ఏకంగా పాతిక వెల దాక ఉద్యోగాలు వస్తాయని, ఏటా 1500 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయని లోకేష్ వివరించారు..