Begin typing your search above and press return to search.

లోకేష్ మార్క్ యాక్షన్- వందేళ్ళ ఏయూ విజన్

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ళ పండుగను చేసుకుంటోంది. మరో 56 రోజులలో ఏయూకి వందేళ్ళు నిండుతాయి.

By:  Satya P   |   1 March 2026 6:00 AM IST
లోకేష్ మార్క్ యాక్షన్- వందేళ్ళ ఏయూ విజన్
X

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ళ పండుగను చేసుకుంటోంది. మరో 56 రోజులలో ఏయూకి వందేళ్ళు నిండుతాయి. 1926 ఏప్రిల్ 26న ఏయూ విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇక ఏయూ తొలి వీసీగా కట్టమంచి రామలింగా రెడ్డి వ్యవహరిస్తే తరువాత డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ వీసీగా వచ్చారు. రాధాకృష్ణన్ తరువాత కాలంలో దేశానికే ఉప రాష్ట్రపతిగా రాష్ట్రపతిగా పనిచేశారు. ఏయూకి ఎందరో ఘనత వహించిన వారు వీసీగా చేశారు. ఇదిలా ఉంటే విశాఖ పర్యటనకు వచ్చిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణ సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏయూకి పూర్వ వైభవం :

ఇదిలా ఉంటే ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. శతాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందని అన్నారు. యూనివర్సిటీని ప్రపంచంలోనే సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా తీర్చిదిద్దేందుకు శతాబ్ది ఉత్సవాలు వేదిక కావాలని లోకేష్ కోరారు మార్చి 26 నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు పూర్వ విద్యార్థులతో మమేకం కావడంతో పాటు శతాబ్ది ఉత్సవాల్లో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు. అంతే కాకుండా శతాబ్ది ఉత్సవాల్లో ఆంధ్ర యూనివర్సిటీ ఘన చరిత్ర ప్రతిబింబించాలని అన్నారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, కమిటీలను సమన్వయం చేసుకోవాలని లోకేష్ అన్నారు.

ఉత్తరాంధ్రా భాగస్వామ్యం :

ఏయూ వందేళ్ల పండుగ కోసం ఉత్తరాంధ్రా అంతా భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రస్తుత విద్యార్థులతో కళలు, సంగీతం, సాహిత్యం వంటి కార్యక్రమాలను రూపొందించాలని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు, విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. అలాగే ప్రముఖలతో వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని అన్నారు. యూనివర్సిటీ వందేళ్ల విజన్ కు అవసరమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు.

కనీ వినీ ఎరగని విధంగా :

ఏయూ వందేళ్ళ పండుగను కనీ వినీ ఎరగని విధంగా నిర్వహించేలా చర్యలు చేపడతామని లోకేష్ చేప్పారు. ఏయూ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఏయూ అంటేనే ఒక అతి పెద్ద విద్యా సంస్థ అని ఆయన పేర్కొంటూ దాని ఖ్యాతిని ఇంకా పెంచే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది అని మంత్రి చెప్పుకొచ్చారు.