Begin typing your search above and press return to search.

ద‌టీజ్ లోకేష్‌: 'పార్టీ'పై ఫుల్ రేంజ్ పంజా.. !

మంత్రి నారా లోకేష్‌.. ఫుల్ రేంజ్‌లో త‌న రాజ‌కీయాల‌ను విస్త‌రిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో పార్టీపై ఆయ న ప‌ట్టు పెంచుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అవుతున్నాయి.

By:  Garuda Media   |   30 July 2026 10:00 PM IST
ద‌టీజ్ లోకేష్‌: పార్టీపై ఫుల్ రేంజ్ పంజా.. !
X

మంత్రి నారా లోకేష్‌.. ఫుల్ రేంజ్‌లో త‌న రాజ‌కీయాల‌ను విస్త‌రిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో పార్టీపై ఆయ న ప‌ట్టు పెంచుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ అవుతున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాలు, జిల్లాలు.. ఇలా ఎక్క‌డ ఎప్పుడు ఏది అవ‌స‌ర‌మో గుర్తించి.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ఒక‌వైపు పాల‌న చూసుకుంటూ.. మ‌రోవైపు.. పార్టీ ప‌నుల్లోనూ బిజీబిజీగా గ‌డుపుతున్నారు. తాజాగా క‌ర్నూల్లో నిర్వ‌హించిన స‌మావేశం లోకేష్ దూకుడుకు ప‌క్కా రియాక్ష‌న్ ఇచ్చింది.

పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఇటీవ‌ల కాలంలో దూరంగా ఉంటూ వ‌చ్చిన వారు కూడా.. తాజాగా లోకేష్ వ‌స్తున్నారని తెలిసిన వెంట‌నే నాయ‌కులు క్యూక‌ట్టారు. అప్పటి వ‌రకు ఉన్న విభేదాల‌ను కూడా కొంద‌రు నాయ‌కులు దూరం పెట్టి చేతులు క‌లిపారు. లోకేష్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు భేష‌జాల‌కు పోకుండా చేతు లు క‌లిపారు. ఇది.. పార్టీలో ఐక్య‌త‌కు నిద‌ర్శ‌నంగా మారింద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. నిజానికి కొన్నాళ్లుగా క‌ర్నూలు త‌మ్ముళ్ల మ‌ధ్య వివాదాలు కొన‌సాగుతున్నాయి.

లోకేష్ అంటే..

నిజానికి టీడీపీలో త‌రం మారుతున్న సంధికాలంలో నాయ‌కుల ప‌రిస్థితి.. అధిష్టానం ఆలోచ‌న‌లు వంటివి ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. చంద్ర‌బాబుకు లోకేష్‌కు మ‌ధ్య వ్య‌త్యాసం.. దూకుడు వంటివి నాయ‌కుల మ‌ధ్య ఆలోచ‌న‌ల‌ను మారుస్తున్నాయి. చంద్ర‌బాబు అయితే.. చెప్పింది వింటారు.. బుజ్జ‌గిస్తారు.. స‌మయం ఇస్తారు.. అనే భ‌రోసా ఉంటుంది. దీంతో త‌ప్పులు చేసిన నాయ‌కులు కూడా వివ‌ర‌ణ‌, విచార‌ణ‌ల‌తో ఏదో ఒక‌ర‌కంగా బ‌య‌ట ప‌డుతున్నారు.

కానీ, లోకేష్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ద‌గ్గ‌ర ఇలాంటి కుద‌ర‌డం లేదు. దీనికి అనేక ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. మైల‌వ‌రం నుంచి పెన‌మ‌లూరు వ‌ర‌కు.. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో చోటు చేసుకున్న వివాదాల‌ను లోకేష్ త‌న‌దైన శైలిలో ప‌రిష్క‌రించారు. ఆయ‌నేమీ సాగ‌దీత ధోర‌ణికి చాన్స్ ఇవ్వ‌రు. ఫ‌టాఫ‌ట్‌.. అన్న‌ట్టు గా నాయ‌కుల‌తో మొహంమీదే మాట్లాడేస్తున్నారు. దీంతో నాయ‌కుల మ‌ధ్య ఐక్య‌త పెంచేందుకు.. పార్టీని లైన్‌లో పెట్టేందుకు ఈ ప‌రిణామాలు దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఇదే ఇప్పుడు క‌ర్నూలులో నాయ‌కులు తిరిగి క‌లుసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింద‌ని అంటున్నారు.