Begin typing your search above and press return to search.

లోకేశ్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం.. ఆ కీలక భేటిలో యువనేత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటే గుర్తుకు వచ్చే పేరు నారా లోకేశ్. పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చే విషయంలోనూ ఆయన కృషి అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   1 Sept 2025 12:19 AM IST
లోకేశ్ కు ఆస్ట్రేలియా ఆహ్వానం.. ఆ కీలక భేటిలో యువనేత..
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటే గుర్తుకు వచ్చే పేరు నారా లోకేశ్. పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చే విషయంలోనూ ఆయన కృషి అంతా ఇంతా కాదు. అసలు పార్టీకి కింది స్థాయి కేడర్ కూడా లేని మంగళగిరిలో పోటీ చేసి మరి భారీ విజయం సాధించారంటే ఆయన గట్స్ ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో అందరూ వద్దన్నా.. ఆయన వినలేదు. అక్కడ జెండా పాతితేనే రాష్ట్రంలో చరిష్మా సంపాదించుకోవచ్చని ఆయన అనుకున్నారు.. జెండా పాతారు.

కీలక నాయకుడిగా..

పార్టీలో కీలకమైన నాయకుడిగా గుర్తింపు సంపాదించుకున్న నారా లోకేశ్. ఐటీ, కమ్యునికేషన్స్, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్డీ శాఖలకు మంత్రిగా పని చేస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీలోని అందరినీ కలుపుకుంటూ గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఐటీ రంగంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేశ్ పాత్ర ఎనలేనిదని చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి ఆయనకు ఆహ్వానం లభించింది. ప్రపంచంలోని నాయకులతో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యం పెంచేందుకు ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అక్కడి ప్రభుత్వం ఆహ్వానం పంపింది.

ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలను చూసే..

ఆర్థిక, మానవ వనరుల అభివృద్ధిలో మంత్రి లోకేశ్ చేపట్టిన కార్యక్రమాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం పరిశీలించింది. వీటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పలికింది. తాము తమ దేశంలో చేపట్టబోయే కార్యక్రమాలలో ఆయన భాగస్వామ్యం అవసరమని అక్కడి ప్రభుత్వం భావించి ఆహ్వానం తెలిపింది. అయితే గతంలో (2001)లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో ఇప్పటి ప్రధాని అప్పడు పాల్గొన్న కార్యక్రమం కావడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆ విషయాలపై పెట్టుబడి దారులతో సమావేశం..

ఆస్ట్రేలియా పర్యటనలో లోకేశ్ విద్యా, నైపుణ్యాభివృద్ది, అక్వా కల్చర్, మౌలిక సదుపాయాలు, తదితర విషయాలపై పెట్టుబడిదారులతో మాట్లాడనున్నారు. ఈ ఆహ్వానం లోకేశ్ కు వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేయడం అభినందనీయమని పలువురు విశ్లేషిస్తున్నారు.