జై హిందీ ...పవన్ బాటలో లోకేష్!
ఇక ఎన్నో కొత్త భాషలను మనం నేర్చుకోవాల్సి ఉందని అన్నారు అదే క్రమంలో హిందీని ఎందుకు నెర్వరాదు అని లోకేష్ ప్రశ్నించారు.
By: Tupaki Desk | 15 July 2025 11:30 AM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాటలో మంత్రి నారా లోకేష్ వెళ్తున్నారా అంటే అవును అని అంటున్నారు. దానికి తాజా ఉదాహరణ హిందీ బాషను పవన్ పెద్దమ్మగా సంభోస్తే హిందీని ఎందుకు మనం ఆదరించి అక్కున చేర్చుకోకూడదని నారా లోకేష్ ప్రశ్నించారు. ఒక జాతీయ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ హిందీ భాష దేశంలో అనుసంధాన భాషగా చెప్పారు. దాని కంటే ముందు జాతీయ భాషగా అంటూ వచ్చారు.
ఇక ఎన్నో కొత్త భాషలను మనం నేర్చుకోవాల్సి ఉందని అన్నారు అదే క్రమంలో హిందీని ఎందుకు నెర్వరాదు అని లోకేష్ ప్రశ్నించారు. దేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష అయిన హిందీని మనం కూడా నేర్చుకుంటూ ముందుకు సాగే అవకాశం ఉంటుందని అన్నారు ఇక్కడే నారా లోకేష్ పవన్ అభిప్రాయాలతో నూరు శాతం ఏకీభవిస్తున్నారు అనుకోవాలి.
పవన్ కూడా ఈ మధ్యనే హిందీ దివస్ కార్యక్రమంలో పాల్గొంటూ హిందీ భాషను నేర్చుకుంటే తప్పేంటి అన్నారు. ఎన్నో భాషలను నేర్చే మనం మన దేశ భాష అయిన హిందీ విషయంలో ఎందుకు విముఖత చూపాలని ప్రశ్నించారు. అంతే కాదు హిందీ భాష నేర్చాలని అందరికీ అర్థం అయ్యేలా ప్రచారం చేయాలని ఆయన కోరారు.
పవన్ హిందీని రాజభాషగా దక్షిణ భారతదేశం అంతా ఆమోదించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. ఇలా పవన్ మాట్లాడి రోజులు గడిచాయో లేదో నారా లోకేష్ కూడా పవన్ కి మద్దతుగా మాట్లాడారు. మా నాయకుడు చంద్రబాబు ఎన్నో కొత్త భాషాలను నేర్చుకోవాలని చెబుతూ వచ్చారని అందులో హిందీ కూడా ఉందని లోకేష్ అన్నారు.
దక్షిణ భారతదేశంలో హిందీని అనుసంధాన భాషగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేవలం హిందీ అనే కాదు జపాన్ జర్మనీ ఇలా ఎన్నో ఇతర భాషలను నేర్చుకోవచ్చు అని లోకేష్ అనారు. భాషలు ఎన్ని కొత్తగా నేర్చుకుంటే అంత ఉపయోగమే ఉంటుందని ఆయన అన్నారు.
హిందీని దేశంలో ఎక్కువ మంది వాడుతున్నారు, కాబట్టి లింక్ భాషగా చేయడంతో ఎలాంటి తప్పు కానీ పొరపాటు కాదని లేదని పవన్ అంటున్నారు. భాషలు అన్ని కో ఆర్డినేట్ చేసుకుంటూ వికాసం కోసం ముందుకు సాగాలని కూడా లోకేష్ అన్నారు. దురదృష్టవశాత్తూ పోటీ పడడం బాధాకరం అన్నారు.
అంతే కాదు ఇంగ్లీష్ తో పాటు దేశీయ భాషలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది, ఈ క్రమంలో హిందీ పెద్ద భాషగా అంతా నేర్వాలని ఆయన సూచించారు. దీని వల్ల మన సంస్కృతిని సమిష్టిగా ఉంటుందని అలాగే సుసంపన్నం కూడా అవుతుందని ఆయన అన్నారు. ఈ విధంగా హిందీ భాషను దక్షిణ భారతంలో అంతా నేర్చుకోవాలని పవన్ అన్న తరువాత నారా లోకేష్ ఆయనకు మద్దతు ఇస్తున్నట్లుగా మాట్లాడడం విశేషం.
ఇక చూస్తే కనుక హిందీ భాష మీద గత కొంతకాలంగా చర్చ సాగుతోంది. తమిళనాడు అయితే హిందీని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కర్ణాటకలో కూడా త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ నూతన జాతీయ విధానం మీద ద్వజమెత్తుతున్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వం విషయం చెప్పాల్సింది లేదు. మొత్తానికి చూస్తే దక్షిణ భారతాన ఒక్క ఏపీ నుంచే హిందీకి విశేష మద్దతు దక్కుతోంది. వరసగా పవన్ లోకేష్ జై హిందీ అంటూ చేస్తున్న ఈ కామెంట్స్ పర్యవసానం ఏమిటి అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.
