లోకేష్ మార్కులు కొట్టేశారా ?
లోకేష్ ప్రసంగం చేస్తూంటే మోడీ ఆసాంతం ఆయన వైపే చూస్తూండిపోయారు. ఒక మోడీ లోకేష్ లోని పరిపక్వతను ప్రతీ సభలో చూస్తూ మార్కులు మంచిగానే వేస్తున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 2 May 2025 3:27 PMఅమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అందరి కంటే ఎక్కువగా ఆకర్షించబడింది నారా లోకేష్ అని అంటున్నారు. లోకేష్ స్పీచ్ ఈసారి మాస్ లెవెల్ లో సాగింది అని అంటున్నారు. నమో అంటూ ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఒక్క మోడీ చాలు మాకు అంటూ లోకేష్ చేసిన ఈ ప్రసంగం మోడీని పూర్తి స్థాయిలో సంతృప్తి పరచింది అని అంటున్నారు.
ఇక చూస్తే ఈ ఏడాది జనవరి 8అ విశాఖలో జరిగిన సభలో నారా లోకేష్ ని దగ్గరగా పిలిచి ఫ్యామిలీతో తనను ఢిల్లీలో కలవమని మోడీ కోరినట్లుగా వార్తలు వచ్చాయి. ఈసారి అమరావతిలో కూడా లోకేష్ తో మోడీ చాలా సరదాగా గడిపారు. ఆయన లోకేష్ ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. అలాగే మెడ మీద చేయి వేసి మరీ తన ఆత్మీయత చూపించారు.
లోకేష్ ప్రసంగం చేస్తూంటే మోడీ ఆసాంతం ఆయన వైపే చూస్తూండిపోయారు. ఒక మోడీ లోకేష్ లోని పరిపక్వతను ప్రతీ సభలో చూస్తూ మార్కులు మంచిగానే వేస్తున్నారు అని అంటున్నారు. బాబు వారసుడు అన్న నీడ నుంచి లోకేష్ మరింతగా ఎదుగుతూ ముందుకు సాగుతున్నారని కూడా కేంద్ర పెద్దలు గుర్తిస్తున్నారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే లోకేష్ సైతం తన స్పీచ్ ని పవర్ ఫుల్ గా ఇస్తున్నారు కేంద్ర పెద్దల వద్ద ఆయన తన టాలెంట్ ని చూపిస్తున్నారు. గతంలో సంగతి ఎలా ఉన్నా ఇపుడు కేంద్ర బీజేపీ పెద్దలు కూడా మిత్ర పక్ష పార్టీలలోని వారసులను ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత రాం విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ని ప్రోత్సహించి కేంద్ర మంత్రిగా చేశారు.
అలాగీ మహారాష్ట్రలో బీజేపీ మాజీ నేత గోపీనాధ్ ముండే కుమార్తె పంకజ్ ముండేకి ప్రోత్సహించి కేబినెట్ లోకి తీసుకున్నారు. ఏపీలో చూస్తే గ్రాస్ రూట్ లెవెల్ దాకా టీడీపీ బలంగా విస్తరించి ఉంది. చంద్రబాబు తరువాత లోకేష్ టీడీపీ మీద మంచి పట్టు సాధిస్తున్నారు. ఈ విషయాలు ఏవీ బీజేపీ కేంద్ర పెద్దలకు తెలియనివి కావు. అందుకే వారు కూడా ముందు చూపుతో దూర దృష్టితో ఏపీలో ఎలా ఏమి చేయాలన్న దాని మీద ఒక క్లారిటీతో ఉన్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో లోకేష్ భావి నాయకుడు అన్నది టీడీపీ వర్గాలకు తెలుసు. అలా ఇంట గెలిచిన లోకేష్ రచ్చ కూడా గెలవాల్సి ఉంది. అందుకే ఆయనను ముందు పెట్టి కూడా టీడీపీ పెద్దలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ విధంగా విశాఖ సభలోనూ అమరావతి మీటింగులోనూ లోకేష్ మోడీకి మరింతంగా సన్నిహితుడుగా మారుతున్నారని అంటున్నారు. మొత్తానికి ఒక వైపు అభివృద్ధి రాజకీయాలు ఎలా ఉన్న పనిలో పనిగా లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ ఏపీ అన్నట్లుగా ఒక ఎలివేషన్ అయితే అవుతోంది. సో ఈ విషయంలో టీడీపీ పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తోంది అని అంటున్నారు.